తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో వైఎస్ఆర్ టిపి మండల అధ్యక్షులు పూర్మాని కర్ణాకర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంతకుముందు ఉన్న అధ్యక్షులు చొక్కాల రాము పార్టీని వీడి వేరే పార్టీలో చేరినంత మాత్రాన జిల్లా మొత్తం ఖాళీ అయిందని అసత్య ప్రచారం మానుకోవాలని అలాగే పార్టీ అధ్యక్షులు షర్మిల ఆదేశానుసారం మండలం పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి కి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మండల యూత్ ప్రెసిడెంట్ జలంధర్ రెడ్డి బీసీ ప్రెసిడెంట్ రాచర్ల రాజు సభ్యులు రమేష్ నాగరాజు ఎల్లయ్య వెంకటరెడ్డి వెంకటేష్, తిరుపతి, కరుణాకర్ పరుశరాములు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు