జగన్ 2.O అంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు..
మీ బొచ్చు మీరే పిక్కోవాలి..
30 సంవత్సరాలు ఎక్కడుంటాడో, జైల్లోనా – కిరణ్ రాయల్..
తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 06:
లండన్ కు వెళ్లొచ్చాక జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లేదని, గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి, అభివృద్ధికి నోచుకోక.రాష్ట్ర ప్రజలను రాష్ట్ర అభివృద్ధిని 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారని, ఇప్పుడు మళ్లీ 2.O తో వస్తున్నామంటే.. రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ గురువారం మీడియా సమావేశంలో చిట్టి రెడ్డి 2.0 అనే పోస్టర్ లను ఆవిష్కరించి, 2.O అట్టర్ ఫ్లాప్ సినిమా అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.ఈసారి మనం అధికారంలోకి వస్తే 30 సంవత్సరాలు మనమే పరిపాలనలో ఉంటామని, రాష్ట్రాన్ని ఏలుతామని అనడం చూస్తే.. జగన్ రెడ్డికి మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు.గతంలో 175 కు 175 అంటే, ప్రజలు 11 సీట్లు మాత్రమే ఇచ్చి,మీ సేవలు ఇక చాలని, మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారని గుర్తు చేశారు. 30 సంవత్సరాలు ఎక్కడ ఉంటారు.. ప్రజల్లోనా, జైల్లోనా అని ప్రశ్నించారు.గత కోడి కత్తి, గొడ్డలిపోటు దాడులను గుర్తు చేస్తూ,జగన్ 1.O లో బాబాయ్ హత్య తో రాజకీయం చేస్తున్నారని, 2.O తో జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు విజయమ్మ, షర్మిలకు జాగ్రత్తగా వుండాలని సూచించారు.మీ బొచ్చు పీకడానికి ఇక్కడ ఖాళీగా ఎవరూ లేరని, మీ బొచ్చు మీరే పిక్కోవాలన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని, ఇప్పటికే కేంద్రం, ఆంధ్ర రాష్ట్రంపై శ్రద్ధచూపి పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలపడమే కాకుండా రాష్ట్రానికి కావలసిన నిధులను సమకూరుస్తుందని గుర్తు చేశారు. ప్రధాని మోదీ సహకారంతో.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు రాష్ట్రంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తూ మరో పది సంవత్సరాలు కూటమి ప్రభుత్వమే ఏపీలో కొనసాగుతుందని కిరణ్ జోష్యం చెప్పారు.ఈ
మీడియా సమావేశంలో హేమ కుమార్, మనోజ్,కిషోర్, హేమంత్, సాయిదేవ్,ఆది, సాయి తదితరులు పాల్గొన్నారు..