
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం అంకుసాపురం గ్రామ సర్పంచి కొయ్యడఎల్లవ్వ నాంపల్లి ఆధ్వర్యంలో ప్రెస్మీట్ ఏర్పాటు చేసినారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో ముందు ఉంటూ గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని పాఠశాలలో గాని పల్లె ప్రకృతి వనానికి గాని గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎంతో దగ్గర ఉండి అభివృద్ధికి కృషి చేశామని గ్రామానికి చెందిన తుమ్మ చెట్లకు సంబంధించి డబ్బులపై అవకతవకలు జరిగాయని గ్రామంలోని కొందరు పనిగట్టుకుని మామీద మండలంలో అధికారులందరికీ ఫిర్యాదులు చేశారని దీనిపై ఈరోజు అనగా శనివారం రోజున గ్రామంలోని ప్రజల మధ్య చర్చ జరిగిందని దీనిపై లెక్కలు తీయగా గ్రామం నుండి మాకే లక్ష 49 వేల రూపాయలు రావాలని తేల్చడం జరిగిందనిదీనిపై ప్రజలు గమనించాలని ఏమైనా తప్పులు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగరాజు. అంజయ్య పరశురాములు జీల ముత్తయ్యకనకయ్య పెంటల ముత్తయ్య పరశురాములు ప్రశాంత్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు