పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే రేగా కాంతారావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నేటి ధాత్రి,
భద్రాచలం టౌన్.స్థానిక బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించినటువంటి ప్రెస్మీట్లో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల లోను బిఆర్ఎస్ పార్టీ విజయం చెందుతుందని, భద్రాచలం నియోజకవర్గంలో బిఆర్ఎస్ నియెజకవర్గ అభ్యర్థి తెల్లం వెంకట్రావు ను అత్యధిక ఓట్ల మెజారిటీతో ప్రజలు గెలిపించాలని, దసర కి , సంక్రాంతి కి వచ్చే గంగిరెద్దులను చూసి మోసపోవద్దని, దసరా బుల్లోడు కి భద్రాచలంలో ఇదే చివరి దసరా అని, భద్రాచలం అభివృద్ధి కి బిఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యం అని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నియెజకవర్గ అభ్యర్థి తెల్లం వెంకట్రావు,మండల అధ్యక్షులు అరికెల్ల తిరుపతి రావు,కార్యదర్శి కొండిశెట్టి కృష్ణమూర్తి,నాయకులు తిప్పని సిద్దులు, బొలిశెట్టి రంగారావు,తదితరులు పాల్గొన్నారు.