Bell Donation to Village Temple
దేవాలయానికి మైక్ సెట్ బెల్ అందజేత
ఇబ్రహీంపట్నం, నేటిదాత్రి
మండలంలోని వర్ష కొండ గ్రామంలో పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయానికి గ్రామానికి చెందిన పిస్క శ్రీనివాస్ లత సుమారుగా పదివేల రూపాయల గల బెల్ అందజేశారు అనంతరం అర్చకులు మధుర అన్వేష్ చార్యులు వారి పేరిట స్వామివారికి అభిషేకం అనంతరం స్వామివారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఉండాలని ఆశీర్వదించారు అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో, అర్చకులు మధుర అన్వేష్ చార్యులు , మరియు గ్రామ మాజీ సర్పంచ్ దొంతల శ్యామల తూక్కారం, మాజీ ఎంపీటీసీల పోరం అధ్యక్షుడు పోనుకంటి వెంకట్ మరియు గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు,
