సిరిసిల్ల జిల్లా దవాఖాన ఆకస్మికంగా తనిఖీలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రకటన
– ఎమర్జెన్సీ వార్డ్లు పరిశీలన
– ఆసుపత్రిలో నీ సమస్యల పై ఆరా
సిరిసిల్ల(నేటి ధాత్రి):
సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో రోగులకు అవసరమైతే తన ఓ నెగిటివ్ రక్తము అందించేందుకు సిద్ధంగా ఉన్నానని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రకటించారు. తనది ఓ నెగటివ్ బ్లడ్ గ్రూప్ అని తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానను కలెక్టర్ శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవఖానలోని ఎమర్జెన్సీ వార్డులు, బ్లడ్ బ్యాంక్, ఐ సి యు, మెటర్నిటీ వార్డ్, ఎస్ ఎన్ సి యు, ఆపరేషన్ థియేటర్లు మిగతా విభాగాలను పరిశీలించి వైద్యులతో మాట్లాడారు. ఏమేమీ ఇబ్బందులు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు.
బ్లడ్ బ్యాంకులో రక్తం విలువలపై హారా తీశారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు అవసరమైతే తన రక్తము అందిస్తానని కలెక్టర్ తెలిపారు. అనంతరం ఆయా విభాగాల్లోని రిజిస్టర్ లను తనిఖీ చేశారు. ఈరోజ విధుల్లో ఎంత మంది డాక్టర్లు ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ సంబంధించి అన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పై రోగులకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఐ .సి.యు,ఎస్ ఎన్ సి యు లోనీ ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి వైద్యులు తీసుకెళ్లారు దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో నీటి సమస్యపై రోగులు తెలుపగా, వాటిని పరిష్కరిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఇక్కడ ఆర్ఎం ఓ సాయికుమార్, వైద్యులు వినత, నికిత, నర్సులు వైద్య సిబ్బంది ఉన్నారు.