Preparations Begin for Zahirabad Municipal Elections
మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు….
◆-: జహీరాబాద్లో ఆరు గ్రామాలు విలీనం…పెరిగిన వార్డుల సంఖ్య
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మున్సిపాలిటీ పరి ధిలో అభివృద్ధి కుంటుపడి ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ప్రజలు ఎదురుచూస్తున్న తరుణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. జహీరాబాద్ మున్సిపాలి టీలో 2019లో ఎన్నికలు జరిగిన ఇప్పటివరకు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించకపోవడంతో పట్టణంలో అభివృద్ధి కుంటుపడింది. దీంతోపాటు మున్సిపల్ పరిధిలో చుట్టూ ఉన్న గ్రామాలు అల్లిపూర్, పస్తాపూర్, తమ్మడపల్లి, చిన్న హైదరాబాద్, హోతి (కే) గ్రామాలను కలుపుతూ మేజర్ మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు పెద్ద మున్సి పాలిటీగా ఏర్పడి నిధులు ఎక్కువగా వస్తాయని ఆశపడ్డప్పటికీ నిధులు రాకపోవడమే కాకుండా ఎన్నికలు నిర్వహించకపోవడం ఆయా వార్డులకు సంబంధించి కౌన్సిలర్లు లేకపోవడంతో అభి వృద్ధి పడకేసింది. గతంలో జహీరాబాద్ మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా ప్రస్తుతం 37 వార్డులుగా ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఓటర్ లిస్ట్ కూడా తయారు చేశారు. ఇందులో 39వేల 352 మంది పురుషు ఓటర్లు ఉండగా 39వేల 467 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. ఎన్నికలు సజావుగా జరిగి మున్సిపల్ కౌన్సిలర్ గా, చైర్మన్ గా ఎన్నికైన నాటి నుంచి అభివృద్ధి పనులు సాగుతాయని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
