
మందమర్రి, నేటిధాత్రి:-
పట్టణంలోని ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్)లో శనివారం నిర్వహించబోయే నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పరీక్షా చీఫ్ సూపరింటెండెంట్, పాఠశాల ప్రిన్సిపాల్ జయకృష్ణారెడ్డి తెలిపారు. కాగజ్ నగర్ నవోదయ విద్యాలయ హిందీ టిజిటి ఉమేష్ కుమార్ పాల్ తో కలిసి పాఠశాలలో పరీక్ష ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 143మంది విద్యార్థులకై నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షకు పట్టణంలోని ఆదర్శ పాఠశాల పరీక్ష కేంద్రంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులందరూ ఉదయం 10గంటల 30నిమిషాలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, అదేవిధంగా పరీక్ష ప్యాడ్, బ్లూ, బ్లాక్ పెన్నులు, హాల్ టికెట్, ఫోటో ఐడెంటిటీ కార్డు మొదలగు వాటితో పరీక్షకు హాజరు కావాలని సూచించారు. పరీక్ష శనివారం ఉదయం 11గంటల 30నిమిషాల నుండి, మధ్యాహ్నం ఒంటి గంట 30నిమిషాల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.