
Bathukamma Festivities in Ramayampet
రామాయంపేట పట్టణంలో బతుకమ్మ సంబరాల సన్నాహాలు..
రామాయంపేట, సెప్టెంబర్ 18 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని వెంకన్నగారి చెరువు వద్ద బతుకమ్మ పండుగ వేడుకలకు సంబంధించి సన్నాహాలు జోరుగా కొనసాగుతున్నాయి. చెరువు కట్టపైకి వచ్చే మహిళలు సౌకర్యంగా పూల బతుకమ్మలు నిమజ్జనం చేయగలిగేలా ప్రత్యేకంగా మెట్లు తయారు చేయడంపై మున్సిపల్ సిబ్బంది పట్టు పట్టారు.
ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా భారీ సంఖ్యలో మహిళలు చెరువుకు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే భద్రతా చర్యలతో పాటు సౌకర్యాల కల్పనకు ముందస్తుగానే పనులు ప్రారంభించారు.
విద్యుత్ దీపాలు, త్రాగునీటి సదుపాయం, చెరువు పరిసరాల్లో శుభ్రతపై కూడా ప్రత్యేక దృష్టి సారించామని మున్సిపల్ అధికారులు తెలిపారు. పట్టణ ప్రజలందరూ పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకునేలా మున్సిపాలిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోందని పేర్కొన్నారు.
పట్టణంలో బతుకమ్మ వేడుకలు మరింత వైభవంగా, భక్తి శ్రద్ధలతో జరగాలని మున్సిపల్ సిబ్బంది ఆకాంక్షిస్తున్నారు.”