అంగన్వాడీ సూపర్వైజర్ రజిత
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యమని, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ సూపర్వైజర్ రజిత అన్నారు. బుధవారం మండలంలోని రంగాపురం గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ టీచర్ల అధ్యక్షతన పోషణ పక్వాడ్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి అంగన్వాడీ సూపర్వైజర్ రజిత గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలనుద్దేశించి మాట్లాడారు. గడుస్తున్న కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తున్నాయని, సంపూర్ణ ఆరోగ్యంతో పాటు చిన్నారులకు ఆహారం, ఆట, పాటలు, ప్రేమతో విద్యనందించే అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే చిన్నారులు పాఠశాలలకు భయం లేకుండా వెళ్లడానికి చదవడం, రాయడం, జ్ఞాపకశక్తితో పాటు మెదడు అభివృద్ధి చెందాలంటే..అంగన్వాడీ కేంద్రాల్లో విద్యతోపాటు..బొమ్మలు వేయించడం..మాట్లాడించడం..ఆహారపు అలవాట్లలో భాగంగా చిరుధాన్యాలు, ఆకుకూరలతో కూడిన ఆహారాన్ని అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తామన్నారు. మార్చి 8 నుంచి 23 వరకు అన్ని గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాలలో, సెక్టర్ లెవెల్, ప్రాజెక్టు లెవెల్ లో అంగన్వాడీ పోషణ పక్వాడ్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. సబ్ సెంటర్ లెవెల్ లో బాలింతలకు, చిన్నారులకు హెల్త్ చెకప్ నిర్వహిస్తామన్నారు. రక్తహీనత తగ్గించేందుకు గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఆకుకూరలతో పాటు చిరుధాన్యాలను అందిస్తామని, రాగులు, జొన్నలు, పెసర్లు, సజ్జలు, బబ్బర్లు, ఉలువలు, పప్పులు మొదలగు వాటిని ఆహారంగా అందిస్తామని తెలిపారు. అంగన్వాడీ సెంటర్లలో పోషణ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్న ప్రసన్న, గర్భిణీ స్త్రీలకు సీమంతం నిర్వహించారు. అనంతరం పోషణ మాసం ప్రతిజ్ఞ మరియు హ్యాండ్ వాష్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అశ్విని, ధనలక్ష్మి, శ్రీవాణి, కృష్ణవేణి, రాధ, అంగన్వాడీ ఆయాలు, తల్లులు, మహిళలు, ఆశా వర్కర్లు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, ప్రీ స్కూల్ పిల్లలు పాల్గొనడం జరిగింది.