మెడికల్ ఆఫీసర్ సాయికృష్ణ
శాయంపేట నేటి ధాత్రి: ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం శాయంపేట హెచ్ఎం ప్రాజెక్ట్ అసోసియేట్ పియ మేనేజర్ అక్కల రమేష్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలకు ఏర్పాటు చేసిన సమావేశానికి మెడికల్ ఆఫీసర్ సాయి కృష్ణ పాల్గొని మాట్లాడుతూ మహిళలు వ్యవసాయ పనుల్లో మహిళల పాత్ర ముఖ్యమైనది. గ్రామాలలో మహిళలు అనేక అనారోగ్య సమస్యలు బాధపడుతున్నారని దీనికి ముఖ్య కారణం రైతులు వివిధ పంటల కొరకై వాడుతున్న విష రసాయనాల వల్ల అనేక సమస్యలకుతలెత్తుతున్నాయని అన్నారు. దీనికిగాను రైతులు మరియు మహిళా రైతులు పంపు కొట్టే సమయంలో పురుగుమందు కలిపే విషయములో జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనే అనేక అనారోగ్య సమస్యలు దారితీస్తున్నాయని అన్నారు. రైతులు పంపులు కొట్టే సమయంలో తప్పకుండా పిపీఈ లను వాడాలని సూచించారు. మన శరీరంలో చిన్న చిన్న సూక్ష్మ రంద్రాల ద్వారా విషరసాయనాలు శరీరంలోకి లోపలికి వెళ్లి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయని పంపు కొట్టే సమయంలో సహకారం అందించే మహిళ రైతులు కూడా తప్పకుండా జాగ్రత్తలు పాటించాలనిపురుగుమందులు కలిపేటప్పుడు నైపుణ్యత పెంపొందించుకొని తగు జాగ్రత్తలు పాటించాలని అవగాహన కల్పించే విధంగా గ్రామాల్లో ప్రజ్వల్ క్షేత్ర సిబ్బంది ఆశ కార్యకర్తల ద్వారానే సాధ్యమైతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పియు మేనేజర్ ప్రియాంక రెడ్డి మెడికల్ సి హెచ్ ఓ మెడికల్ సూపర్డెంట్ ప్రజ్వల్ క్షేత్ర సిబ్బంది రాంబాబు, తిరుపతి, సునీల్, కల్పన, మెడికల్ సిబ్బంది, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.