Pre-Primary Kids Learn Through Educational Tour
ప్రై- ప్రైమరీ విద్యార్థుల అవగాహన పర్యటన
నేటిదాత్రి అయినవోలు :-
పాత్ ఫైండర్ పాఠశాల ప్రీ-ప్రైమరీ విద్యార్థులు శనివారం సమాజంలో ముఖ్యమైన సేవలపై అవగాహన కలిగించడానికి ఒక విద్యా పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు సూపర్ మార్కెట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బ్యాంక్ మరియు పెట్రోల్ బంక్ లను సందర్శించారు.సూపర్ మార్కెట్లో విద్యార్థులు నిత్యావసర వస్తువులు ఎలా కొనుగోలు చేస్తారు, బిల్లింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది అనే విషయాలను నేర్చుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు, నర్సులు ప్రజలకు ఎలా సేవలు అందిస్తారో తెలుసుకున్నారు. బ్యాంకులో డబ్బును ఎలా ఆదా చేస్తారు, దాన్ని ఎలా భద్రపరుస్తారు అనే విషయాలను గమనించారు. చివరిగా పెట్రోల్ బంక్లో వాహనాలకు ఇంధనం ఎలా నింపుతారు, దాని ప్రాధాన్యత గురించి అవగాహన పొందారు.
ఈ పర్యటన విద్యార్థుల్లో సామాజిక అవగాహనను పెంపొందించి, పాఠశాల పాఠ్యాంశాలను నిజజీవిత అనుభవాలతో అనుసంధానించేలా చేయడంలో సహాయపడింది అని ప్రిన్సిపాల్ సుభానోద్దీన్ వివరించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కవిత, హైమావతి, నాగశ్రీ మరియు లక్ష్మి లు ఉత్సాహంగా, ఆనందంగా పాల్గొన్నారు
