బిఆర్ ఎస్వి నాయకుల ముందస్తు అరెస్టులు
విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలి
జాబ్ క్యాలెండర్ ను ప్రకటించాలి
శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం మాందారిపేట గ్రామానికి చెందిన బిఆర్ ఎస్వి నేతను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.బిఆర్ ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిన్న అసెంబ్లీ ముట్టడిలో భాగంగా కేయూ బిఆర్ ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ముందస్తుగా అరెస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరం కాలములో ఆరుసార్లు బిఆర్ ఎస్విరాష్ట్ర నాయకులు కొమ్ము ల శివను అక్రమ అరెస్టులు చేశారు ఈ సందర్భంగా బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ సామాజిక ప్రజా ఉద్యమాలకు వేదిక అయిన ఓయూలో విద్యార్థులు నిరసన కార్యక్రమాలు రద్దు చేయడం అన్యాయం అని అన్నారు విద్యాశాఖకు మంత్రిని నియమించ కుండా కాలయా పన చేస్తూ విద్యార్థుల జీవితా ల తోటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెలగాటమాడుతూన్నాడని మండిపడ్డారు వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించి, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగించాలని డిమాండ్ చేశారు.