బీఆర్ఎస్వీ నాయకుల ముందస్తు అరెస్ట్…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో తెలంగాణ అసెంబ్లీ ముట్టడి ఉన్న నేపథ్యంలో బిఆర్ఎస్వీ నాయకులను రామకృష్ణాపూర్ పట్టణ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి నాయకులు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయిందని, ఎన్నికల్లో గెలుపు కోసం నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే ఉద్దేశంతో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టిన సందర్భంగా ముందస్తు అరెస్టు చేయడం మంచిది కాదని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు శ్రవణ్, గోనె రాజేందర్, గాజుల చంద్ర కిరణ్, దేవి సాయికృష్ణ, కుర్మ దినేష్, కంది క్రాంతి తదితరులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.