ప్రజా సంఘాల నాయకుడు పీక కిరణ్ డిమాండ్.
మహా ముత్తారం నేటి ధాత్రి.
మహాముత్తారం లో పత్రికా విలేకరుల సమావేశంలో ప్రజా సంఘాల నాయకుడు పీక కిరణ్ మాట్లాడుతూ హైదరాబాద్ లోని అశోక్ నగర్ బృందావన్ హాస్టల్ లో నిరుద్యోగ విద్యార్థినీ ప్రవళిక మృతి, చాలా బాధాకరం, నిరుద్యోగల జీవితలతో చెలగాటం ఆడుతున్న రాష్ట్ర ప్రభుత్వం, టి ఎస్ పి ఎస్ సి బోర్డు. టి ఎస్ పి ఎస్ సి వైఫల్యం వల్ల,ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో విద్యార్థి, నిరుద్యోగల ఆత్మహత్యలు,ప్రవళిక ది ఆత్మహత్య కాదు ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య గా మీము భావిస్తున్నాము. ప్రభుత్వం తన కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్ గేషియ్ ప్రకటించాలి. తన కుటుంబానికి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, తక్షణమే పరీక్షల తేదీలను ప్రకటించాలిని, లక్షలాది మంది నిరుద్యోగల జీవితాలని నాశనం చేస్తున్న టిఎస్పిఎస్సి బోర్డు చైర్మన్ తో సహా టి ఎస్ పి ఎస్ సి సభ్యులను తొలగించి , టి ఎస్ పి ఎస్ సి చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం కొత్త సభ్యులని నియమించాలి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలి, డి .ఎస్. సి .పోస్టుల సంఖ్యను ముఖ్యమంత్రి అసెంబ్లీ లో ప్రకటించిన విధంగా 13500 కు పెంచాలి.బ్యాక్ లాగ్ పోస్టులు కాకుండా అదనంగా పరీక్షల రద్దుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాధ్యత వహించి పరీక్షలు రాసిన అభ్యర్థులకు మూడు లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలిని పీక కిరణ్ డిమాండ్ చేశారు .