
Congress government
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ప్రణవ్…
– లబ్ధిదారులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం..
– 5 మండలాలు,2పట్టణాల పరిధిల చెక్కుల పంపిణీ.
– జమ్మికుంట (నేటిధాత్రి)
పరిస్థితి బాగోలేక ఆసుపత్రులపాలై ఇబ్బందులు పడ్డ లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ అన్నారు.హుజూరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.నియోజకవర్గపరిధిలోని 5 మండలాలు,2 పట్టణాలు కలిపి 147 మంది లబ్ధిదారులకు 51,14,000/- విలువ చేసే చెక్కులను అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ చెక్కులు అందుకున్న వారు త్వరగా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలని,చెక్కుల పంపిణీ చేయడంలో అలసత్వం వహిస్తున్న కౌశిక్ రెడ్డి తన విధానం మార్చుకోవాలని సూచించారు.ప్రోటోకాల్ అని రెచ్చిపోయే కౌశిక్ రెడ్డి,చెక్కులు ఇచ్చే క్రమంలో సీఎం ఫోటో కట్ చేసి ఇవ్వడం ప్రోటోకాల్ ఆ అని ప్రశ్నించారు?.
ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు..
ప్రజా సంక్షేమమే ద్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల రూప కల్పన చేస్తుందని,ప్రజా ఆమోదయోగ్య సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలో మొదటి స్థాయిలో నిలుస్తుందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ అన్నారు.కాంగ్రెస్ పథకాలే రాబోయే స్థానిక పోరులో మమ్మల్ని గెలిపిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో అన్ని మండలాల అధ్యక్షులు,మార్కెట్ చైర్మెన్ లు,డైరెక్టర్లు,దేవస్థాన చైర్మెన్ లు సీనియర్ నాయకులు,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ నాయకులు,కార్యకర్తలు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.