శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా ప్రమోద్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ పోలీస్ స్టేషన్ వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరిస్తూ శాంతి భద్రతలు కృషి చేస్తానని అలాగే మండల ప్రజలందరూ సహకరించాలని కోరారు.అంతే కాకుండా అసాంఘిక కార్యక్రమాలు జూదం అక్రమ మద్యం తరలించిన వారిపై ప్రత్యేక దృష్టి సాధిస్తామన్నారు బదిలీపై వచ్చిన ఎస్ఐకి పోలీస్ స్టేషన్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు ఇక్కడ పనిచేసిన ఎస్ఐ దేవేందర్ కేయూసి పోలీస్ స్టేషన్ కు బదిలీపై వెళ్లారు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించే వారిపై చట్టరీత్యా కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని ఎస్సై తెలిపారు.