అంతర్జాతీయ స్థాయిలో ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం

సెమినార్ : కోసరి గోపాల్
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట, రేగొండ, గీసుకొండ, పర్వతగిరి. మండలంలోని వివిధ గ్రామాలలో ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలోనిర్వహిస్తున్నటువంటి నేల పునరుత్పాదక ప్రాజెక్ట్ అమలు విధానంపై శనివారం, ఆదివారం రోజున జరిగినటువంటి అంతర్జాతీయ ఐ.డి హెచ్& బి. సి. ఐ( బెటర్ కాటన్ ఇనిషియేటివ్) సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ సెమినార్లో కార్యక్రమానికి శాయంపేట మండలంలోని వసంతపూర్ గ్రామానికి చెందిన కోసరిగోపాల్ హాజరై బి. సి. ఐ వారి ఆర్థిక, మరియు డబ్ల్యు డబ్ల్యు ఎప్- ఇండియా సాంకేతిక సహకారంతోనిర్వహిస్తున్నటువంటి బీసీఐ మరియు హెచ్ & ఎం ప్రాజెక్టు కార్యక్రమాల గురించి అనుభవాలను పాల్పంచుకోవడం జరిగిందని ప్రాజెక్టు మేనేజర్. వై ఇన్నారెడ్డి తెలి పారు. ఢిల్లీలో జరిగినటువంటి అంతర్జాతీయ సెమినార్లో ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ద్వారా కోసరి గోపాల్ ను నియమితులై గత 12సంవత్సరాల నుంచి అమలు చేస్తున్నటువంటి ప్రాజెక్టు కార్యక్రమాల గురించి అంతర్జాతీయ స్థాయిలో జరిగిన సెమినార్లో నేల పునరుత్పాదక వ్యవసాయంలో భాగంగా వివిధ మండలాల్లోని బిసిఐ రైతులు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి నేల పునరుత్పాదక, భూసార యాజమాన్య, ఎరువు, పురుగుమందుల నియంత్రణ. పలు అంశాల గురించి సమిష్టి నిర్ణయాల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి. నవయుగ, నవజీవన్, నవ చైతన్య. సహకార సంఘం నిర్వహణ కార్యక్రమాల గురించి తన అనుభవాలనుపాలుపంచుకున్నట్లు తెలి పారు. ఈ కార్యక్రమంలో బి సి ఐ, ఐడిహెచ్, డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్- ఇండియా ప్రతినిధి బృందం అంతర్జాతీయ వివిధ ఎన్జీవోస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రజ్వల్ రైతు ఉత్పత్తి దారుల సంఘం ఉపాధ్యక్షులు& రైతు
వరంగల్ ఉమ్మడి జిల్లాలోని శాయంపేట రేగొండ, గీసుకొండ, పర్వతగిరి. మండలంలోని బి సి ఐ రైతులు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలపై అంతర్జాతీయ స్థాయిలో జరిగిన సెమినార్లో ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం నుండి అమలు చేస్తున్న కార్యక్రమాలపై నాకు అవకాశం కల్పించిన డబ్ల్యుడబ్ల్యుఎఫ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ పుల్లూరి వంశీకృష్ణ మరియు అంతర్జాతీయ స్థాయిలో ప్రాజెక్టు అమలు కార్యక్రమాలపై వివరించినందుకు ఎంతో గాను అదృష్టమని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా బీసీఐరైతులకు ఎంతో మేలైతుందని ఆశ వ్యక్తం పరుస్తున్నట్లు వివరించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!