ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బాయ్స్ హై స్కూల్లో కార్యక్రమం
మెట్ పల్లి మార్చి 12 నేటి దాత్రి
మెట్ పల్లి పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగం గా ఏడవ రోజు కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని ఒకటో వార్డు బాయ్స్ హైస్కూల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ కుమార్ కౌన్సిలర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థుల చేత ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం త్వరలో జరగబోయే పదవ తరగతి బోర్డు పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు పలు సలహాలు, సూచనలు అందించారు.
అలాగే విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, హాల్ టికెట్లను మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ కుమార్, కౌన్సిలర్లు పంపిణీ చేశారు.
కార్యక్రమం సందర్భంగా పాఠశాలలో ఉన్న మరుగుదొడ్లు సరిగా లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాఠశాల సిబ్బంది తెలియజేశారు. దీనిపై స్పందించిన మున్సిపల్ చైర్మన్ వెంటనే సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అదేవిధంగా పాఠశాలలో ఉన్న భోజనశాలను కూడా మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు పరిశీలించారు.
