భూపాలపల్లి నేటిధాత్రి
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొనే అన్ని వేదికలలో ప్రచార భాద్యతలు రచయిత గాయకుడు మిట్టపల్లి సురేందర్ కి అప్పగిస్తూ బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు హైదరాబాద్లో కేటీఆర్ మిట్టపల్లి సురేందర్ ని తన నివాసం కి పిలిపించుకోని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి సమక్షంలో భాద్యతలు అప్పగిస్తూన్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు ఈ సందర్బంగా ఈ ఎన్నికలు అయిపోయే అంత వరకు అన్ని వేదికలపైన మిట్టపల్లి సురేందర్ బృందంతో తెలంగాణా లో జరిగిన అభివృద్ధి,సంక్షేమఫలాల మీద ఆట, పాటలు ఉంటాయి అని వారు పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించిన సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ కు మిట్టపల్లి సురేందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తన సొంత నియోజకవర్గానికి చెందిన మిట్టపల్లి సురేందర్ కు ప్రచార భాద్యతలు అప్పగించినందుకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి సంతోషము వ్యక్తం చేస్తు సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ లకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.