· ఐదుసార్లు వరుసగా ధార్వాడ్ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నిక
· రెండు సార్లు అత్యధిక మెజారిటీతో అందరి దష్టిని ఆకర్షించిన నేత
· 1992 `94లో ధార్వాడ్ ఈద్గా మైదానంలో జాతీయ పతాకం ఎగురవేసిన జోషి
· ఎట్టకేలకు ఈ మైదానంపై సుప్రీంకోర్టు అనుకూల తీర్పు
· అప్పగించిన శాఖలు నిబద్ధతతో నిర్వహణ
· 80కోట్ల మంది ప్రజలకు పీడీఎస్ ద్వారా ధాన్యం అందేలా పర్యవేక్షణ
· ఉల్లి ధరల నియంత్రణకు “భారత్ దాల” పథకం
· కర్ణాటక బీజేపీలో సుస్థిర స్థానం
హైదరాబాద్, నేటిధాత్రి:
కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం`ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కర్ణాటకకు చెందినవారు. ఆహారం`ప్రజాపంపిణీ శాఖను నిర్వహిస్తున్న 13వ మంత్రిగా, పునరుత్పాదక ఇంధన వనరుల శాకకు పదవ మంత్రిగా కొనసాగుతున్నారు. 2019`24 మధ్యకాలంలో ఆయన పార్లమెంటరీ వ్యవహారాల శాఖను, u£గ్గు, మైనింగ్ శాఖలను కూడా నిర్వహించారు. 2004 నుంచి ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ధార్వాడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014`16 మధ్యకాలంలో కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014`18 మధ్యకాలంలో లోక్‌సభలో ఛైర్పర్సన్స్ ప్యానల్లో పనిచేశారు. 1962 నవంబర్ 27న మైసూరు రాష్ట్రానికి చెందిన బీజాపూర్‌లో జన్మించారు. తండ్రిపేరు వెంకటేష్ జోషి, తల్లి మాలతీబాయి జోషి. ఈ దంపతులకు ప్రహ్లాద్ జోషి మూడో సంతానం. ఈయన ప్రాథమిక విద్యాభ్యా సం రైల్వే స్కూల్లో జరగ్గా, సెకండరీ, హైస్కూల్ విద్యాభ్యాసం హుబ్బళ్లిలోని న్యూ ఇంగ్లీష్ స్కూల్లో జరిగింది. హుబ్బళ్లిలోని కడసిద్దేశ్వర్ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. చిన్నతనం నుంచే ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పట్ల ఆసక్తి పెంచుకొని అందులో కార్యకర్తగా తన ప్రస్థానాన్ని ప్రారంబించారు. తర్వాతి కాలంలో ఆయన ఆరఎసఎస్ శిక్షణా శిబిరాల్లో పాý£్గన్నారు.
1992‘94 మధ్యకాలంలో హుబ్లీ (కర్ణాటక) ఈద్గా మైదానంలో, రాష్ట్రీయ స్వయం సేవక్ సం ఘ్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆరఎసఎస్ తరపున ఈ కార్యక్రమంలో పా ý£్గనడం ద్వారా ప్రహ్లాద్ జోషి పేరు అందరికీ సుపరిచితులయ్యారు. ఈ ఈద్గామైదానం ఎవరి దనే దానిపై విచారించి ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు అప్పగించాలని సుప్రీంకోర్టు తీర్పుచె ప్పింది.
ప్రహ్లాద్ జోషి ధార్వాడ్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు 2004, 2009, 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తొలినాళ్లలో పారిశ్రామికవేత్తగా వున్న ఆయన 1992, 1994 మధ్యకాలంలో హుబ్లీలోని ఈద్గా మైదాన్‌లో జాతీయ పతాకావిష్కరణ కా ర్యక్రమానికి నేతత్వం వహించడం ద్వారా ఒక్కసారిగా ప్రజల్లో మంచి ప్రాచుర్యం పొందారు. ఇదే కాలంలో ఆయన “కాశ్మీర్‌ను రక్షించాలి” పేరుతో ఉద్యమాన్ని నడపడం ద్వారా రాష్ట్రవ్యాప్తం గా ప్రజలందరికీ సుపరిచితులయ్యారు. అప్పటినుంచి ఆయన రాష్ట్రంలో ఒక గుర్తింపు పొందిన ప్రముఖ రాజకీయవేత్తగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. తర్వాత ఆయన ధార్వాడ్ జిల్లా కు బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన మొట్టమొదటిసారి 2004లో ధార్వాడ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీచేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బి.ఎస్. పాటిల్‌ను ఓడించారు. ఆ తర్వాత వరుసగా మూడుసార్లు ఇదే పార్లమెంట్ స్థానానికి ఎన్నికవుతూ వచ్చి, ప్ర స్తుతం కూడా ఇదే స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009లో కర్ణాటకలోని 28 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోనే రెండో అత్యధిక మెజారిటీ సాధించిన నేతగా గుర్తింపు పొందారు. కానీ ఇదే ఎన్నికల్లో కేంద్ర మంత్రులు, ఎంపీలు చాలామంది ఓటమి పాలవడం గమనార్హం. అంటే రాష్ట్రంలో బీజేపీకి ఎదురుగాలి వీచిన సందర్భంలోనూ ఆయన తన నాయక త్వ పటిమను చూపారు. మళ్లీ 2019 ఎన్నికల్లో ధార్వాడ్ సీటును లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుచుకొని మరోసారి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు.
2019 మే నెలలో కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత ఆయన్ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, u£గ్గు, మైనింగ్ శాఖల మంత్రిగా ప్రధాని నరేంద్రమోదీ నియమించారు. ఆయన 2024 జూన్ వరకు ఈ పదవుల్లో కొనసాగారు. 2024 ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించిన తర్వాత ఆయనకు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖలను అప్పగించారు. ప్రస్తుతం ఆయన ఈ శాఖలను నిర్వహిస్తున్నారు. వరుసగా ఒక నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎన్నికవడం ద్వారా ప్రహ్లాద్ జోషి రికార్డు సష్టించారనే చెప్పాలి. అయితే ఈసారి తన గెలుపు మార్జిన్ తగ్గడం పట్ల కొద్దిగా అసంతప్తిని వ్యక్తం చేశారు. జోషి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. భారతీయ శాస్త్రీయ సంగీతం, క్రికెట్ అంటే ఆయనకు వల్లమాలిన అభిమానం.
వినియోగదారుల హక్కులను కాపాడటం, వారిలో తగిన చైతన్యాన్ని నింపడంలో ఆయన ఎంతో చురుగ్గా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలపై దష్టి కేంద్రీకరించి, వాటిని అరికట్టేందుకు కషిచేస్తున్నారు. ప్రజలందరికీ ఆహారభద్రత కల్పించాలన్నదే ఆయన ధ్యే యం. ఆయన తూనికలు, కొలతలు కచ్చితంగా వుండేవిధంగా, వీటికి సంబంధించి ఆధునిక సాంకేతికతలను ఎప్పటికప్పుడు ప్రవేశపెట్టి అమలు చేయడంలో తగిన శ్రద్ద చూపుతున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ద్వారా నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా వుండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆవిధంగా తాను నిర్వహిస్తున్న వినియోగదారుల మంత్రిత్వశాఖ ద్వారా “ఆత్మనిర్భర్ భారత”, “మేకిన్ ఇండియా” కార్యక్రమాలకు మద్దతుగా నిలుస్తున్నారు. అంతేకాదు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద దేశంలో 80కోట్ల మంది పేదలకు ప్రజాపంపిణీ వ్యవస్థల ద్వారా ఆహార ధాన్యం అందేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 2024లో మంత్రి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత “భారత్ దాల” స్కీమ్‌ను ప్రారంభించి ఉల్లి వంటి నిత్యావసరాలుతక్కువ ధరలోనే ప్రజలకు అందుబాటులో వుండేలా చర్యలు తీసుకుంటున్నారు.
