Use Govt Paddy Centers, Avoid Middlemen
ఆర్టీసీ జహీరాబాద్ డిపోలో ప్రగతి చక్ర అవార్డుల పంపిణీ కార్యక్రమం
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ జహీరాబాద్ డిపోలో ఈరోజు( శుక్రవారం) ప్రగతి చక్ర అవార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక డి.ఎస్.పి సైదా హాజరై విజేతలకు అవార్డులను అందజేశారు ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలందించిన డ్రైవర్లు కండక్టర్లు మెకానిక్ లకు మరియు ఇతర సిబ్బందిని ప్రశంసిస్తూ ప్రశంసా పత్రాలు పంపిణీ చేయడం జరిగింది.ముఖ్యఅతిథిగా విచ్చేసిన డీఎస్పీ సైదా మాట్లాడుతూ ప్రజా సేవలో భాగంగా ఆర్టిసి ఉద్యోగులు నిరంతరం కృషి చేస్తున్నారు వారి సేవలను గుర్తించి గౌరవించడం ఎంతో సంతోషకరం డ్యూటీలో అందరూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రశాంతమైన వాతావరణంలో ఓపికతోని విధులు నిర్వహించాలని అందరికీ సూచించడం జరిగింది.మరియు స్థానిక డిపో మేనేజర్ టి. స్వామి మాట్లాడుతూ ఈ అవార్డుల ఉద్యోగుల ప్రతిభను వెలికితీయడమే కాకుండా మరికొంత ఉత్సాహంతో పనిచేయడానికి ప్రోత్సహిస్తాయని పేర్కొన్నారు. డీఎస్పీ గారి చేతుల మీదుగా అందరికీ ప్రశంసా పత్రాలు మరియు నగదు పురస్కారాలతో అభినందించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ మరియు గ్యారేజ్ సూపర్వైజర్ బంగి నాయక్ మరియు డిపో సూపర్వైజర్లు. డిపో సిబ్బంది అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.కార్యక్రమం ముగింపు సందర్భంగా డిపో మేనేజర్ ముఖ్య అతిథి డిఎస్పి గారి చేతుల మీదుగా శబరిమల అయ్యప్ప స్వాముల ప్రత్యేక బస్సుల యొక్క చార్జీల వివరాలకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేయడం జరిగింది చివరిగా డి.ఎస్.పి గారిని శాలువాతో సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
