ప్రగతి సేవా సమితి వ్యస్థాపకులు
గద్దల జాన్
మరిపెడ నేటి ధాత్రి.
పేద ప్రజల కు అండగా ఉండేది ప్రగతి సేవా సమితి అని ప్రగతి సేవాసమితి వ్యవస్థాపకులు గద్దల జాన్ అన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామంలోని ప్రగతి సేవాసమితి మండల కార్యాలయంలో మహిళలకు, రైతులకు పొదుపు సంఘాల ఏర్పాటు పై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గద్దల జాన్ పాల్గొని తను మాట్లాడుతూ గత 1995సంవత్సరంలో 30మంది మహిళ సభ్యులతో పొదుపు సంఘాలుగా ఏర్పడిందని తెలిపారు తర్వాత అంచలంచెలుగా ఎదిగి 30 కో ఆపరేటివ్ సొసైటీలతో సంఘం బలపడిందని అన్నారు.సొసైటీ లీడర్లు, సభ్యుల సహకారంతో ఎనమిది బ్యాంక్ లనుండి కోట్లాది రూపాయల ఋణ సహాయం అందిందని అన్నారు.దీనితో పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు అర్ధిక అభివృద్ధి చెందడానికి ప్రగతి సేవాసమితి చేసిన సేవలు దోహద పడ్డాయని అన్నారు.ఇప్పటికైనా ప్రతి ఇంట్లో ఉన్నసభ్యులందరు వయసు, లింగ బేధం లేకుండా మహిళలు, రైతులు, కార్మికులు, కూలీలు తదితర రంగల్లో ఉన్నవారందరూ పొదుపు చేసుకొని సంఘాలుగా ఏర్పడి ధీమాగా ఉండాలని సుశించారు. ఈకార్యక్రమంలో ప్రగతి సేవాసమితి మరిపెడ మడల కో ఆర్డినేటర్ ఐనాల పరశురాములు , నెల్లికుదురు మండల కో ఆర్డినేటర్ చేడుపాక వెంకన్న, చిన్నగూడూరు మండల కో ఆర్డినేటర్ ఆలేటి వంశీ,అబ్బాయిపాలెం కో ఆర్డినేటర్ జినక సువార్త, మరిపెడ టౌన్ కో ఆర్డినేటర్ జిన్న లచ్చయ్య,తానంచర్ల కో ఆర్డినేటర్ సీత వీరభద్రం, రాంపురం కో ఆర్డినేటర్ బందు పరశురాములు, గాలివారిగూడెం కో ఆర్డినేటర్ ఈదుల మహేశ్వరి, గిరిపురం కో ఆర్డినేటర్ పెద్దబోయిన కుమారస్వామి , అమృతండా కో ఆర్డినేటర్ ఏడెల్లి సునీత, వీరారం కో ఆర్డినేటర్ మామిడాల వెంకన్న, విస్సంపల్లి కో ఆర్డినేటర్ శాగంటి చైతన్య, జయ్యారం కో ఆర్డినేటర్ బర్పటి రాధ, కందికొండ కో ఆర్డినేటర్ కొర్నీ జ్యోతి, మోదుగులగూడెం కో ఆర్డినేటర్ కందిపాటి కరుణాకర్, ఎడ్జర్ల కో ఆర్డినేటర్ గోపి రమేష్, మల్లెపంగు విజయ్, మదనతుర్తి కో ఆర్డినేటర్ ఎల్ సుమలత,నార్షింహులపేట కో ఆర్డినేటర్ కొమిరే వెంకన్న తదితరులు పాల్గొన్నారు.