నల్లబెల్లి, నేటి ధాత్రి:
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని చేతి వృత్తుల వారు సద్వినియోగ పర్చుకోవాలని బీజేపీ మండల ప్రధానకార్యదర్శి తడుక వినయ్ గౌడ్ అన్నారు.ప్రధాని మోదీ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం విశ్వకర్మ యోజన పథకం ద్వారా 18 రకాల కులాల అభ్యున్నతికి రూ.13 వేల కోట్లు బడ్జెట్ కేటాయించారన్నారు. ఈ పథకం ద్వారా చేతి వృత్తుల వారికి 15 రోజులు శిక్షణ అందించి శిక్షణ సమయంలో రోజుకు రూ. 500 ఇస్తూ రూ.15 వేల విలువైన టూల్ కిట్ ఉచితంగా అంది స్తారన్నారు. శిక్షణ అనంతరం తక్కువ వడ్డీతో మొదటి విడతగా లక్ష రూపాయలు, రెండో విడతలో రూ.2 లక్షలు రుణం ఇప్పిస్తామన్నారు. పేద ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ పథకం మోదీ ప్రవేశ పెట్టారని, మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారు లకే నగదు వస్తుంద న్నారు.మండలంలో అర్హు లైన అన్ని కులాల వారు బీజేపీ మండల నాయకులకు వివరాలతో దరఖాస్తు అందజేస్తే ఆన్‌లైన్‌లో నమోదు చేసి రుణం ఇప్పిస్తామని పథకానికి ఎంత మంది అయినా దర ఖాస్తు చేసుకోవచ్చన్నారు.