
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని కౌకొండ గ్రామంలో స్ఫూర్తి సేవా సదన్ వారి ఆధ్వర్యంలో ఆరోగ్యం పరిశుభ్రత అవగాహన సదస్సు నిర్వహించారు.అనంతరం స్ఫూర్తి సేవా సదన్ వారు ఆరోగ్యం, పరిశుభ్రత అవగాహన గ్రామంలో ఉన్న పిల్లలకు పెద్దలకి ఆరోగ్యం పరిశుభ్రత పౌష్ఠికాహారం గూర్చి సేంద్రియ పద్దతిలో పెరటి తోటలు,కూరగాయ మొక్కలు పెంచాలని అవగాహన కల్పించి వీటి ద్యార ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు.అనంతరం ఉచితంగా కూరగాయల విత్తనాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జి.స్టీవెన్ స్ఫూర్తి సేవ సదన్ కో ఆర్డినేటర్.ఈ కార్యక్రమములో ఫెసిలిటేటర్ స్పందన,డా.సాదిక్ పాష,ఆశ వర్కర్ లలిత,క్లబ్ లీడర్ మమత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.