
వర్షం పడితే కొమ్మను ముట్టుకుంటే షాక్
ప్రమాదం ఉందని చెప్పినా పట్టించుకోని విద్యుత్ అధికారులు.
చిట్యాల, నేటి దాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని పాత సిడిపిఓ ఆఫీస్ దగ్గర గల విద్యుత్ లైన్ తీగలు చెట్టులో నుంచి ఉన్నవి ఇటీవల కురిసిన వర్షాలకు ఆ చెట్టును ముట్టుకుంటే కరెంట్ షాక్ వస్తుందని ప్రజలు భయపడుతున్నారు. ఇక్కడ గతంలో జయశంకర్ జిల్లా ఏర్పడక ముందు జిల్లా సిడిపిఓ ఆఫీసుగా ఉండేది, ఇప్పుడు ఆఫీసు జయశంకర్ జిల్లాకు తరలించినందున దానిని పట్టించుకునేవారు లేకపోవడం తో అక్కడున్న చెట్టు పెద్దగా పెరిగి విద్యుత్ లైన్ తీగలను మూసేసింది, ఈ విషయం కాలనీవాసులు ఎన్నిసార్లు విద్యుత్ శాఖ అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సి డి పి ఆఫీస్ లైను బట్టలు ఆరేసుకోవడానికి దండెంలా మారిందని రోడ్డు వెంబడి వెళ్లే వ్యక్తులు చెట్టును తాగడం వల్ల షాక్ వస్తుందని భయపడుతున్నారు, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెట్టు తడిసిపోయి కొమ్మలు భూమిని తాకడంతో కరెంట్ షాక్ వస్తుంది, ప్రతి రెండో శనివారం విద్యుత్ శాఖ అధికారులు మరమ్మత్తుల పేరుతో ఏం పనులు చేస్తున్నారని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాత సిడిపిఓ ఆఫీస్ దగ్గర లైను క్లియర్ చేసి ప్రమాదం జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు లేనియెడల సంబంధిత జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ , జిల్లా విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి రానున్నది వర్షాకాలం కావున ప్రమాదం జరగకుండా చూడాలని మా ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నారు.