
మంచిర్యాల నేటిదాత్రి:
ఈరోజు శాలివాహన పవర్ ప్లాంట్ కార్మికుల సమస్యల పరిష్కారం గురించి జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వరంగల్ వారి కార్యాలయంలో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశంలో పవర్ ప్లాంట్ యాజమాన్యం మరియు కార్మికులు పాల్గొన్నారు. కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ పవర్ ప్లాంట్ మూసివేసి గత 15 నెలలు కావస్తున్న కార్మిక చట్టం ప్రకారం చెల్లించవలసిన బెనిఫిట్స్ చెల్లించకుండా పవర్ ప్లాంట్ యాజమాని మల్కా కొమురయ్య నిర్లక్ష్యం చేస్తున్నారు. కావున కార్మికుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని త్వరగా కార్మికుల యొక్క సమస్య పరిష్కరించాలని కోరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భారతీయ మజ్దూర్ సంఘం జిల్లా కార్యదర్శి మద్దూరి రాజు యాదవ్, పవర్ ప్లాంట్ కార్మిక సంఘం అధ్యక్షులు కుంటాల శంకర్, కార్యదర్శి నిమ్మరాజుల సత్యనారాయణ, ఉపాధ్యక్షులు సగుర్తి ఆనంద రావు, కాయితి శ్రీనివాస్, పెంట సత్యం, ఆసరి రాజయ్య, కాయితి బుచ్చయ్య, ఈసారపు శంకర్, గెల్లు ఎల్లయ్య,లు పాల్గొన్నారు