ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీలో చేరిక పై మండిపడ్డ పిఓడబ్ల్యు నాయకులు

చెన్నూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా చెన్నూరులో మంగళవారం రోజున పిఓడబ్ల్యు నాయకులు చెన్నూర్ మండల కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పిఓడబ్ల్యు జిల్లా నాయకులు మద్దేల భవాని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీలో చేరికను ఉద్దేశించి మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను తాకట్టు పెట్టవద్దని ఆ బహుజనవాదం పేరుతో ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీ ప్రజలను నమ్మించి గొంతు కోసే విధంగా మీ పద్ధతులు, మీ ఆలోచనలు ఉన్నాయని, బిఆర్ఎస్ లో చేరికతో పూర్తిగా రుజువైందని అన్నారు. మొన్నటి వరకు కుటుంబ పాలన, దొరలపాలన, నియంత పాలన అంటూ వ్యతిరేకించిన మీకు నేడు దొర గౌతమబుద్ధుడిలా,డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లా,జ్యోతిరావు పూలేలా కనిపిస్తున్నాడా అని విమర్శించారు. ఈరోజు మీరు చేసిన మోసం చూస్తుంటే ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఆడటానికి అనేక జట్టులు పోటికి వచ్చినట్లే, ఎన్నికలు వచ్చినా ప్రతి ఐదు సంవత్సరాలకు క్రికెట్ జట్ల మాదిరిగా పార్టీలు పుట్టుకొస్తాయని అన్నారు.చిన్న చిన్న సమస్యలతో సతమతమవుతూ న్యాయం కోసం ఎదురుచూసే బడుగు బలహీనవర్గ ప్రజానీకం మీలాంటి వారి స్వార్థానికి , స్వాలంబనకి బలిపశువుల మారుతారని మీ ద్వారా మాకు వాస్తవ సత్యం అర్థమవుతుందన్నారు. దొర వదిలినా బాణం అని ఎంతోమంది అన్నప్పటికీ ఎవరి మాటలు పట్టించుకోకుండా నమ్మకుండా మీ మీద పూర్తి నమ్మకంతో విశ్వాసంతో పని చేసినందుకు ఈరోజు మా దళిత బహుజన ప్రజలందరికీ నమ్మక ద్రోహం చేశారని,నమ్మి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పజెప్పితే అంగట్లో అమ్ముడుపోయి ,ఇంకా ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ల కోసం నా విలువైన సమయాన్ని వృధా చేయను నాకు అంత సమయము లేదు అంటున్నారని,సరిపోయే అంతా ప్యాకేజీ ముట్టిందని, నిజం చెప్పాలంటే బహుజన ప్రజానీకంపై ఎలాంటి జాలి దయా మీకు లేదని అన్నారు.అదే విధంగా గత 30 సంవత్సరాలుగా మాదిగ హక్కుల కోసం పోరాటం చేస్తూ నేను మాదిగను అని రోడ్డుమీద గర్వంగా చెప్పుకునే అటువంటి స్వేచ్ఛ అవకాశం వచ్చేలా చేసిన మందకృష్ణ మాదిగ కి ధన్యవాదాలు అంటూ నేడు తెలంగాణ ఎంపీ ఎన్నికల సందర్భంగా కేంద్రంలో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం అని బిజెపి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే ఎస్సీ వర్గీకరణ కోసం భారతజాతిని, రాజ్యాంగాన్ని మొత్తం బిజెపి మోడీ దగ్గర తాకట్టు పెట్టి మీరు సాధించే వర్గీకరణ ఎవరి కోసం అని ప్రశ్నించారు. భారత రాజ్యాంగమే ప్రమాదంలో పడిన తర్వాత హక్కులు వర్గీకరణలు ఎక్కడి నుంచి వస్తాయి అన్నారు. 2019 లో మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ మేము చేస్తామని చెప్పినా మోడీ ప్రభుత్వానికి ఇంకా 100 రోజులు కావటం లేదా అని ప్రశ్నించారు. దళిత బహుజనలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే వారిని ఎవరు కూడా నమ్మకూడదు అని ప్రజలకు పిలుపునిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో
పిఓడబ్ల్యు మంచిర్యాల జిల్లా నాయకులు కె శిరీష్,
పిఓడబ్ల్యు చెన్నూర్ మండల నాయకులు ఎం ప్రవలిక , లక్ష్మి ,పద్మ ,దుర్గా, శ్రీలతా ,వసంత,
ఐఎఫ్టియు చెన్నూర్ డివిజన్ అధ్యక్షులు మాసాని రమేష్
పివైఎల్ చెన్నూర్ మండల కార్యదర్శి తగరం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!