Felicitation to Pottipalli Sarpanch and Ward Members
పొట్టి పల్లి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు సన్మానం
◆-: “మాజీ సీడిసి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ ”….
◆-: సర్పంచులు గ్రామ అభివృద్దే లక్ష్యంగా పనిచేయాలి..
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండలంలోని పొట్టి పల్లి గ్రామ పంచాయతీ రెండవ విడత ఎన్నికలో బి అర్ ఎస్ పార్టీ బలపరిచిన నాయకులు శ్యామల మొగులయ్య సర్పంచ్ గా విజయం సాధించగా సర్పంచ్ తో పాటు వార్డు మెంబర్లను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన జహీరాబాద్ నియోజకవర్గం సీనియర్ నాయకులు మాజీ సి డి సి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ…
రెండవ విడత స్థానిక ఎన్నికల్లో నూతనంగా విజయం సాధించిన సర్పంచులు గ్రామములో వీధిలైట్లు, శానిటేషన్, గ్రామస్తులకు త్రాగునీరు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. గెలిచిన బి అర్ ఎస్ సర్పంచులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా సర్పంచులు బాధ్యతగా పనిచేస్తూ గ్రామస్తుల మన్నలను పొందాలి అన్నారు. సేవాగుణంతో పని చేసే వారికి ప్రజల గుర్తింపు ఉంటుంది అని గుర్తు చేశారు. పార్టీలో పని చేసే ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యులేనని, గ్రామ పాలనలో వారందరి సేవ వెలకట్టలేనిదని, మీతో పాటు నేను గ్రామాల ప్రగతి లక్ష్యంగా నిరంతరం పని చేస్తాము అన్నారు. ఓటమి పాలైన బి అర్ ఎస్ నాయకులు ఎవ్వరూ అధైర్యపడవద్దని వారందరూ సమయాభావంతో ఉండి గ్రామాల్లో మరింత సేవ చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ సిద్దన్న పాటిల్, సర్పంచ్ శ్యామల మొగులయ్య, ఉప సర్పంచ్ జనార్దన్, మాణిక్ పస్తాపూర్ రాములు శేరి బసవరాజ్ శివకుమార్ పాండు విష్ణు సునీల్ తదితరులు పాల్గొన్నారు.
