చేర్యాల నేటిధాత్రి…
జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే గా గెలిచి మొదటిసారిగా చేర్యాల, కొమురవెళ్లి మండల కేంద్రాల్లో పర్యటించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని సోమవారం బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల పర్వతాలు యాదవ్ ముఖ్య నాయకులతో కలిసి శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. చేర్యాల మండలంలో నెలకొన్న పలు రాజకీయ, అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి నియోజకవర్గ అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కత్తుల కృష్ణవేణి, స్థానిక ఎంపీటీసీ గూడూరు బాలరాజు, రాజబాబు, నరేష్ గౌడ్, రవి తదితరులు పాల్గొన్నారు.