Kavitha to Launch New Party on April 25
ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ ప్రకటన శ్రీరాంపూర్‌లో పోస్టర్ ఆవిష్కరణ
శ్రీరాంపూర్,నేటి ధాత్రి:
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏప్రిల్ 25న కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో,మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో పార్టీ ఆవిర్భావానికి సంబంధించిన పోస్టర్‌ను నాయకులు ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్,వర్కింగ్ ప్రెసిడెంట్ తిప్పారపు సారయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.నూతన పార్టీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని,ఏప్రిల్ 25న జరిగే పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు సిద్ధంశెట్టి సాజన్,ఐద ప్రశాంత్,రామ్మోహన్ చారి, అడ్లకొండ రవి గౌడ్,ముష్క రవి కిరణ్,పానుగంటి అశోక్,లక్ష్మణ్, కందుల స్వరాజ్,మేడి రాజశేఖర్, సాయి,సంపత్ తదితరులు పాల్గొన్నారు.
