
జిల్లా కలెక్టర్ & ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా
అత్యవసర సేవల రంగం కింద విధుల్లో ఉన్న వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం
భూపాలపల్లి నేటిధాత్రి
బుధవారం సమీకృత కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో లో జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా పోస్టల్ బ్యాలెట్ అంశం పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ & ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా మాట్లాడుతూ ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 60 ప్రకారం నిర్దేశిత వర్గాలకు( ప్రత్యక్షంగా ఓటు వేయడానికి వీలులేని వారికి మాత్రమే) పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించిందని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులలో ఉండే అధికారులు సిబ్బందికి, భారత ఎన్నికల కమిషన్ గుర్తించిన 13 రకాల అత్యవసర సేవలు రంగాలకు చెందిన సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించడం జరుగుతుందని అన్నారు.
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇండియన్ రైల్వేస్ ఆర్టిసి ప్రెస్ ఇన్ఫర్మేషన్ దూరదర్శన్ ఆల్ ఇండియా రేడియో విద్యుత్ శాఖ వైద్య ఆరోగ్యశాఖ బిఎస్ఎన్ఎల్ , మీడియా, ఫైర్ సర్వీసెస్ మొదలగు అత్యవసర సేవ రంగాలకు చెందిన విధులు నిర్వహించే అభ్యర్థులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని అన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేవారు పోలింగ్ కు పది రోజుల ముందు ఫామ్ 12 ద్వారా రిటర్నింగ్ అధికారికి సమాచారం అందించాలని అన్నారు. ఎన్నికల పోలింగ్ విధులలో పాల్గొనే పోలింగ్ అధికారి ప్రిసైడింగ్ అధికారి ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు.
అత్యవసర సేవ విభాగాలకు చెందిన వారు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన ఐదు రోజుల్లోపు ఫార్మ్ 12 డి సమర్పించి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం పొందాలని కలెక్టర్ తెలిపారు.విధులలో ఉన్న సిబ్బందికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని, ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని అధికారులు సంబంధిత పోస్టల్ బ్యాలెట్ ప్రతిపాదనలు సకాలంలో సమర్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు రెవెన్యూ డివిజన్ అధికారి రమాదేవి , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.