
టిపిసిసి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా పోషిని రవీందర్ నియామకం:-
హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్):-
టిపిసిసి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా పోషిని రవీందర్ ను నియమిస్తూ టిపిసిసి రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ గారు ఉత్తర్వులు జారీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ గా నియమించిన పొన్నం అశోక్ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు, ఈ పదవి రావడానికి సహకరించిన కాంగ్రెస్ లీగల్ సెల్ మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరియు కాంగ్రెస్ లీగల్ సెల్ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.రవీందర్ నియామకం పై పలువురు సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.