పాలకుర్తి నేటిధాత్రి
గౌడ జన హక్కుల పోరాట సమితి ( మోకుదెబ్బ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పోశాల వెంకన్న గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ సంఘం సిల్వర్‌జూబ్లీ ఉత్సవాల సందర్బంగా ఇటీవల నిర్మల్‌లో నిర్వహించిన రాష్ట్ర 3వ మహాసభల అనంతరం ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన కమిటీలో పోశాల వెంకన్నకు ఈ గౌరవ ప్రధమైన స్థానం దక్కింది. ఈయన ఈ కమిటీ లో గతంలో ఈ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, కొన్ని సంవత్సరాలుగా గౌడల సమస్యలపై పలు సేవలందించారు. ఈ కృషికి గుర్తింపుగా ఈ సంఘంలో అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సందర్బంగా పోశాల వెంకన్న మాట్లాడుతూ ఈ ఎన్నికకు సహకారం అందించిన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్, సెక్రటరీ జనరల్ రాగుల సిద్ధరాములు గౌడ్, గౌరవ అధ్యక్షుడు ప్రొఫసర్ కట్టాగాని రవీందర్ గౌడ్ లకు కృతజ్ఞతలు తెలిపాడు. భవిష్యత్ లో సంఘం చేపట్టే వివిధ సమస్యల సాధనకు తన వంతు నాయకత్వం పాత్ర పోషిస్థానని తెలిపారు.