రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శిగా మండల కేంద్రానికి చెందిన పూరెళ్ళ శ్రీకాంత్, ఉపాధ్యక్షులుగా వెలిచాల గ్రామానికి చెందిన కాడే నర్సింగం, కార్యదర్శిగా దేశరాజుపల్లి గ్రామానికి చెందిన వెల్ముల రమేష్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మండల అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి బాధ్యతలను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ కి, చోప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జి బోడిగె శోభకు, మండలంలోని పార్టీ నాయకులందరికి దన్యవాదములు తెలిపుతూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని, గ్రామాలలోని గడప గడపకు కలియ తిరుగుతూ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.