
Sanitation Neglected in Mahadevpur
అటకెక్కిన పారిశుధ్యం
* పట్టించుకోని పంచాయతీ అధికారి
మహాదేవపూర్ ఆగస్టు 29 (నేటి దాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య పనులు అటకెక్కాయని శుక్రవారం రోజున గ్రామ ప్రజలు వాపోయారు. గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లవాడలో రోడ్డుకు ఇరుప్రక్కల మురుగునీటి కాలువలు లేక రోడ్డుపై మురుగునీరు నిలిచి ఇండ్లలోకి వస్తున్నాయని వాపోయారు. గ్రామ ప్రజలు, వ్యవసాయదారులు రాకపోకలు నిర్వహిస్తున్నారు పొరపాటున ఎవరైనా కాలుజారి కింద పడితే మునిగే ప్రమాదం ఉందనీ ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారి చొరవ తీసుకొని మురుగునీటి వ్యవస్థను మెరుపరిచి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుచున్నారు.