
అక్రమ వడ్డీ వ్యాపారంతో చతికిలపడ్డ పేద కుటుంబం
తమకు న్యాయం చేయాలంటూ మీడియాతో ఆవేదన
గంగవరం నేటి ధాత్రి:
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం పత్తికొండ గ్రామంలో ఉన్న సుబ్బమ్మ,
వెంకటరమణ,దంపతులు కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు, వీరి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో అదే గ్రామానికి చెందిన వెంకటా చలపతి నాయకర్ దగ్గర ఐదు రూపాయలు వడ్డీతో 50,000 రూపాయలు తీసుకున్నట్లు అనంతరం ప్రతినెల వడ్డీ కడుతూ ఈ మధ్యనే పూర్తి అప్పు తీర్చేశామని బాధితులు
సందర్భంగా మీడియాతో తెలిపారు,
అయినా కానీ నాయకర్ తమపై అక్రమంగా పలమనేరు లో ఉన్న ఒక లాయర్ ని సంప్రదించి తమపై అక్రమ కేసు పెట్టి నోటీసు పంపించారని డబ్బులు పూర్తిగా నాయకర్ కి
వడ్డితో సహా తీసుకున్న డబ్బులు చెల్లించిన కూడా
ఇంత అన్యాయంగా తమపై నోటీస్ రూపంలో మనోవేదనకు గురి చేస్తున్నారని వారి ఆవేదన వ్యక్తం చేశారు, తాము వృత్తిరీత్యా కూలి పని చేసుకుంటూ జీవనం సాగించేవారుమని వారి మనోవేదన వ్యక్తం చేశారు, తమపై ఇంత అన్యాయం చేసిన నాయకర్ గ్రామం మొత్తం వడ్డీ వ్యాపారం చేస్తూ ఎంతో మందికి ఇదేవిధంగా మనోవేదన గురిచేస్తూ వారిని చిత్రహింసలు పెడుతూ గ్రామాన్ని వదిలి కూడా కొంతమంది వెళ్ళిపోయేలాగా చేశారని తమ అందరికీ అధికారులు న్యాయం చేయాలని మీడియా ద్వారా అధికారులకు వారి ఆవేదన తెలిపారు,ఎటువంటి లైసెన్సులు లేకుండా అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తూ ఎంతోమందిని వారి ఆసరా ఆయుధంగా చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు..