Tributes to Ponnam Sarayya Mudiraj
పొన్నం సారయ్య ముదిరాజ్ చిత్రపటానికి ఘన నివాళులు.
బాధిత కుటుంబాలకు “మెపా” అండగా ఉంటుంది.
పులి దేవేందర్ ముదిరాజ్
మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు,
అచ్చునూరి కిషన్ ముదిరాజ్
మెపా ములుగు జిల్లా అధ్యక్షుడు.
హన్మకొండ:నేటిధాత్రి
మెపా రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రాజు ముదిరాజ్ తండ్రి అయిన పొన్నం సారయ్య ముదిరాజ్ ఇటీవల గుండెపోటు’తో మృతి చెందిన సందర్బంగా ఈరోజు వారి స్వగ్రామం అయిన రాజపల్లె లోని వారి నివాసానికి వెళ్లి పొన్నం సారయ్య ముదిరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి, వారి కుమారులు పొన్నం రాజు, కృష్ణ ముదిరాజ్ కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చడం జరిగింది.
ఈ సందర్భంగా మెపా రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ కష్టం వచ్చిన కుటుంబాలకు మెపా (ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ) ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రాజు, కృష్ణ కుటుంబానికి భరోసానిచ్చారు.
అలాగే మెపా ములుగు జిల్లా అధ్యక్షుడు అచ్చునూరి కిషన్ ముదిరాజ్ మాట్లాడుతూపొన్నం సారయ్య ముదిరాజ్ మృతి చాలా బాధాకరం, సారయ్య ఎక్కడ ఉన్న అతని ఆత్మ శాంతిచాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటూ, ఆపదలో ఉన్న ముదిరాజ్ కుటుంబాలకు మెపా అండగా నిలుస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెపా ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కల నాగరాజు ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు భూమ నరేష్ ముదిరాజ్, చొప్పరి రాజేందర్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.
