Grand Birthday Celebrations for Ponguleti Srinivas Reddy
పీఎస్ఆర్,పీవీఆర్ యువసేన అధ్యర్యంలో పొంగులేటి జన్మదిన వేడుకలు
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
మండలం కేంద్రంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బాణా సంచా పేల్చి ఘనంగా పొంగులేటి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ సందర్బంగా యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు దార అశోక్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ గ్రామం నుండి అయినా అన్న అని ఒక పిలుపు ఇస్తే నేను ఉన్న అని అభయం ఇచ్చే నాయకుడు మన పొంగులేటి శ్రీనన్న అని ఆయన ఆధ్వర్యంలో మరెన్నో అభివృద్ధి పనులు జరగాలని ఆశిస్తూ ఇలాంటి జన్మ దిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని జీవితం లో మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని కోరారు.
ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నటుగా తెలిపారు.
ఈ కార్యక్రమం లో ఏఏంసి డైరెక్టర్ ఊకే బుచ్చయ్య, ఎస్ కే వాజీద్ పాషా, ఎస్కె కాసీం, నునావత్ రవి,బొంగు చంద్రశేఖర్, పల్లపు రాజేష్, గడ్డం రాజేష్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
