Urban Nature Parks to Reduce Pollution
ప్రకృతి వనాల ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చు
ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ
మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్
నర్సంపేట,నేటిధాత్రి:
పట్టణ ప్రకృతి వనాల ద్వారా పట్టణాల్లో కాలుష్యాన్ని తగ్గించి,ప్రజలకు స్వచ్ఛమైన గాలిని,ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెండం శ్రీలక్ష్మి రామానంద్ అన్నారు.యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్,ఫిల్టర్ బెడ్,పట్టణం ప్రకృతి వనాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ పెండం శ్రీలక్ష్మీ రామానంద్,వైస్ ఛైర్మన్ గంధం నరేందర్ గుప్తా కౌన్సిలర్స్ బీరం భరత్ రెడ్డి,బాణాల ప్రసన్న శ్రీనివాస్, అయూబ్ ఖాన్ లతో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ వీధి కుక్కలు, వాటి పిల్లుల జనాభాను శాస్త్రీయంగా నియంత్రించడానికి, రేబీస్ వ్యాధిని అరికట్టడానికి యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను త్వరలో నర్సంపేట పట్టణంలో ప్రారంభించబోతున్నామని తెలిపారు.జంతువులకు స్టెరిలైజేషన్ మరియు యాంటీ-రేబీస్ టీకాలు వేసి,తిరిగి అదే ప్రాంతంలో వదిలేయడం వలన జంతువుల సంక్షేమానికి,మానవ-జంతు సంఘర్షణలను తగ్గించడానికి ఉత్తమ మార్గం అని అన్నారు.వేసవి కాలంలో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రజలందరికీ తాగునీరు అందించడానికి మున్సిపల్ యంత్రంగంతో తగిన చర్యలు తీసుకుంటున్నామని,నీటి ఎద్దడి తలెత్తకుండా ముందుగానే ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.
