
Chimpula Satyanarayana Reddy
ఇంటిస్థలాన్ని విరాళంగా ఇచ్చిన పొల్యూషన్ బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణ రెడ్డి
శంకర్ పల్లి, నేటిధాత్రి:
చేవెళ్ల మున్సిపాలిటీ పరిధి దేవుని ఎర్రవల్లి వార్డులోని కార్మికురాలు తూర్పాటి అండాలకు రాష్ట్ర పొల్యూషన్ బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణ రెడ్డి 60 గజాల ఇంటి స్థలాన్ని ఉచితంగా విరాళంగా ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైనప్పటికీ, స్థలం లేకపోవడంతో అండాలకు ఇల్లు నిర్మించేందుకు సత్యనారాయణ రెడ్డి తమ స్వంత భూమిని దాతగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. గురువారం స్థలం రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, మున్సిపాలిటీ కమిషనర్ వెంకటేశం సమక్షంలో పట్టా డాక్యుమెంట్లను కార్మికురాలు అండాలకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో దేవుని ఎర్రవల్లి మాజీ ఎంపీటీసీ చంద్రయ్య, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సామాజిక బాధ్యతతో ముందుకొచ్చిన సత్యనారాయణ రెడ్డిని అందరూ ప్రశంసించారు.