ప్రశాంతంగా కొనసాగిన పోలింగ్
ఓటుహక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన రూరల్ ఏసిపి
అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్న పట్టభద్రులు….
గంగాధర నేటిధాత్రి :

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గంగాధర లోని ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఉదయం నుండి పోలింగ్ ప్రశాంతంగా సాగుతుండగా ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు కల్పించారు. గంగాధర పోలింగ్ కేంద్రాన్ని కరీంనగర్ రూరల్ ఏసిపి శుభం ప్రకాష్ సందర్శించి పోలింగ్ సరళిని భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అయన వెంట స్థానిక ఎస్సై నరేందర్ రెడ్డి ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఊహించిన విధంగా ఓటేసేందుకై పట్టభద్రులు అధిక సంఖ్యలో హాజరై ఓటు వేసేందుకు బారులు తీరడం కనిపించింది. అధిక సంఖ్యలో చిన్నారులను తీసుకొని పోలింగ్ కేంద్రాల్లో ఓట్టు వేసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులు పోటా పోటీగా బరిలో దిగగా వారికి ధీటుగా ఓటర్లు కూడా అధిక శాతం హాజరు కావడం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఏదేమైనప్పటికిని గతంలో ఎన్నడు లేని విధంగా పట్టభద్రులుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి స్థానిక ఎన్నికలను తలపించే విధంగా ఓటర్లు పాల్గొన్నారు.