అసంపూర్తిగా ఉన్న ఆలయం పై రాజకీయమా ?

ఆలయ నిర్మాణం పూర్తి చేసి టీటీడీ లేదా ఎండోమెంట్ వారికి ఆలయం మేమే అప్పగించడానికి మేము సిద్ధం…

ఇది ఒక్క వ్యక్తి యొక్క ఆస్తి కాదు,ప్రజల ఆస్తి..

మేము భక్తునిగా భగవంతుడి సేవకులం మాత్రమే.

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మంజూరు నగర్ నందు వేంచేసి ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే, ఆలయ ధర్మకర్త,చైర్మన్ గండ్ర వెంకట రమణా రెడ్డి
ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ…
భూపాలపల్లి, మంజూరు నగర్ లో లోక కళ్యాణం కొరకు, భక్తుల దర్శనార్థం సంవత్సర కాలంలోనే శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించి, మూల విరాట్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రతిస్టించుకున్నాం.
ఈ సంవత్సర కాలంలో తిరుమల తిరుపతి లో స్వామి వారికి జరుగుతున్న కైకార్యాలను ఏ లోటూ లేకుండా ప్రతి రోజూ నిర్వహిస్తున్నాం.
మనం ఈ రోజు ఉన్న ఈ ప్రాంగణం ఎంతో చరిత్రను సంతరించుకోనుంది.
ఈ ఆలయంలో రాజ గోపురం, ఉత్తర ద్వారం, యాగశాల,చుట్టూ ప్రహరీ గోడ, పాకశాల నిర్మాణం పనులు చేయాల్సి ఉంది.
ఇప్పటికే కొంత మెటీరియల్ కూడా వచ్చింది.
వేరే ఆలయం దగ్గర నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ఇక్కడి ఆలయ నిర్మాణ శిల్పులు అక్కడి వెళ్ళడం జరిగింది
మళ్ళీ సంక్రాంతి వరకు ఇక్కడ మిగిలిన నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేసేందుకు కొంచెం సమయం పడుతుంది.
ఈ ఆలయాన్ని ఎండోమెంట్ కు అప్పగించాలని స్థానిక శాసనసభ్యులు సదరు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసిందని..
అయితే ఆలయానికి సంబంధించి కొన్ని పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పనులు పూర్తయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ఆలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించే ఆలోచన ఉందని అన్నారు.
ఒకవేల కుదరకపోతే ఎండోమెంట్ కే అప్పగిస్తామన్నారు.
అయితే ఆలయానికి సంబంధించిన కొన్ని పనులు మాత్రం పూర్తి కావాలన్నారు.
అదేవిధంగా అధికారమనేది శాశ్వతం కాదని దేవుని ఆశీర్వాదం, ప్రజల నిర్ణయం మేరకు ఉంటుందన్నారు.
ఆలయాన్ని తను కమిట్మెంట్తో కట్టినట్లు తెలిపారు. ఇప్పటికైనా ఆలయం పూర్తి అయ్యేంత వరకు కొంత సమయం ఇవ్వాలని గుడికి సంబంధించి తన వ్యవహార శైలి ఈ విధంగానే కొనసాగిస్తామని అనుకుంటే వారి విచక్షణకు వదిలేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్ధి భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్ పిఎసిఎస్ మాజీ చైర్మన్ పూర్ణచందర్ రెడ్డి కౌన్సిలర్ నూనె రాజు కరాటే శ్రీనివాస్ రవీందర్ రెడ్డి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!