
`రసకందాయంలో కూటమి రాజకీయం!
`ఇప్పుడు తేలుతుంది అసలైన మిత్ర ధర్మం.
`తమ్ముడు అన్న వైపు నిలుస్తాడా!
`రాజకీయమే ముఖ్యమనుకుంటాడా!
`అన్నదమ్ముల మధ్య అంతరం మొదలైనట్లా!
`కూటమి బీటలకు తొలి అడుగా!
`బాలయ్య ఇంత కాలం దాచుకున్నది బైట పెట్టాడా!
`ఊహించని పరిణామమా!
`సినీ చాయ్‌లో చిన్న తుఫానా!
`జన సైనికులు స్పందించొద్దని లేఖ ఎందుకు విడుదల చేశారు.
`చిరంజీవి స్పందన నిప్పు రాజేసిందా!
`చిరంజీవి కూల్‌గా రాసిన ఉత్తరమే కుంపటి పెట్టిందా!
హైదరాబాద్, నేటిధాత్రి:
సినీ ఇండ్రస్ట్రీలో హీరోలు పైకి ప్లాస్టిక్ నవ్వులు పూయించుకుంటూ, కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతారని చెప్పడానికి బాలయ్య చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని ఇండ్రస్త్రీ వర్గాలే అంటున్నాయి. మేమంతా బాగానే వుంటాం. మీరు మా కోసం కొట్టుకోకండి. వాదులాడుకోకండి. తిట్టుకోకండి. అంటూ నీతులు చెప్పే హీరోల మధ్య వుండే మనస్పర్తలు ఎలా వుంటాయనేది అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాటల్లో అర్ధమైంది. ఇప్పటికీ మూడుసార్లు హిందూ పురం ఎమ్మెల్యే వున్న బాలకృష్ణ బహుషా అసెంబ్లీలో మాట్లాడడం ఇది రెండోసారి అనుకుంటా…గతంలో ఒకసారి ఏదో సందర్భంలో రెండు నిమిషాలు మాట్లాడినట్లు గుర్తు. కాని ఇప్పుడు కూడా ఓ రెండు నిమిషాలు మాట్లాడారు. అది ప్రజల కోసం కాదు. ప్రజా సమస్యల మీద కాదు. తనకు జరిగిన అవమానం మీద మాట్లాడారు. తాను సినీ పెద్దను అనే విషయాన్ని పరిశ్రమ గుర్తించడం లేదన్న అక్కసును వెళ్లగక్కినట్టున్నారని ప్రత్యర్ధులు విమర్శిస్తున్నారు. విచిత్రమేమిటంటే ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ సినీపెద్దలను అవమానించాడన్నది గత కొంత కాలంగా సాగిన విపరీత ప్రచారం. నిజానికి ఆ ప్రచారాన్ని ఆదిలోనే తుంచేయాల్సింది. కాని దానిపై
ఆ మధ్య చిరంజీవి గాని, ఇటు ప్రభుత్వ వర్గాలు గాని స్పందించలేదు. దాంతో అది చిలికి, చిలికి గాలి వాన అయ్యింది. ఒక రకంగా కూటమి విజయానికి కూడా పనికొచ్చింది. సహజంగా సినీ పరిశ్రమను అవమానిస్తే, సగటు ప్రేక్షక లోకం కూడా ఎంతో బాధపడుతుంది. తమ అభిమాన హీరోలను ఎవరు అవమానించినా తట్టుకోలేరు. అదే గతంలో జరిగింది. అయితే ఆ అవమానం జరిగిందనేది నిన్నటిదాకా పాకిన వార్త. కాని గత ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి తనను ఎలాంటి అవమానం చేయలేదని, ఎంతో గౌరవంగా చూసుకున్నారంటూ చిరంజీవి మీడియాకు లేఖ విడుదల చేశారు. దాంతో వైసిపికి కొండంత బలం వచ్చినట్లైంది. కాని కూటమికే ఏకంగా చిచ్చుపెట్టినట్లైంది. మీడియాకు మంచి మసాల దొరికింది. ఓ వారం పది రోజుల వరకు ధమ్ బిర్యాని వండేందుకు ఢోకా లేదు. ఇరువైపుల అభిమానుల ఆవేశాలకు కూడా కొదువుండదు. పైగా మీడియా ఎప్పటికప్పుడు సినీ పెద్దల మధ్య వుండే గ్యాప్‌పై వార్తలు రాస్తే, చూశారా? అదంతా మీడియా సృష్టే అని అనేవారు. ఇదేంటి? అని మీడియా కూడా ప్రశ్నించే పరిస్దితి వచ్చింది. అసలు మ్యాటర్‌లోకి వెళ్లే, గురువారం నాడు అసెంబ్లీలో బిజేపి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గత ప్రభుత్వ అదికారంలో సినీ పెద్దలకు తీవ్ర అన్యాయం జరిగిందన్న విషయాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో చిరంజీవి లాంటి హీరో మాజీ సిఎం. జగన్‌ను కలిసేందుకు స్వయంగా ఆయన ఫోన్ చేసినా స్పందించలేదని గుర్తుచేశారు. పరిశ్రమ గురించి మాట్లాడాలంటూ పదే పదే అడగడంతో ఓ ఐదుగురు మాత్రమే రావాలని జగన్ సూచించినట్లు కామినేని గుర్తుచే శారు. పైగా చిరంజీవి బృందం తాడేపల్లి గూడెం జగన్ ప్యాలెస్‌కు వెళ్లే అవమానించారన్నారు. గేటు బైటే హీరోల కార్లు ఆపేసి, నడుచుకుంటూ వెళ్లేలా చేశారు. తీరా చిరంజీవి బృందం అక్కడికి వెళ్లినా అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో చర్చించి వెళ్లండని జగన్సందేశం పంపినట్లు గుర్తుచేశారు. దాంతో చిరంజీవి ఒకింత అసహనానికి గురై జగన్ రమ్మంటేనే వచ్చాం. అలాంటిది ఇలా అవమానిస్తారా? అని బెదిరించడంతో అప్పుడు జగన్ వచ్చారని కామినేని అన్నారు. దీంతో ఒక్కసారికి అసహనానికి గురైన ఎమ్మెల్యే బాలయ్య లేచి కామినేని చెప్పిందాంట్లో కొన్ని అబద్దాలున్నాయన్నారు. జగన్‌ను ఎవరూ బెదిరించలేదన్నారు. అందులోనూ ఎవడూ…అంటూ ఏక వచనం ప్రయోగించారు. ఆ సమయంలో తనను కూడా సంప్రదించారని బాలయ్య గుర్తు చేశారు. అయి తే జగన్‌ను ఉద్దేశించి బాలయ్య మాట్లాడుతూ సైకో అని సంబోధించారు. చిరంజీవిని సినీ పెద్దగా గుర్తించే అర్ధమొచ్చేలా కామినేని వ్యాఖ్యల ను బాలయ్య తప్పు పట్టారు. ఇది గడిచిన కొద్ది సేపటికే చిరంజీవి మీడియాకు మూడు పేజీల లేఖను విడుదల చేశారు. బాలయ్య చెప్పినదాంట్లో నిజం లేదన్నారు. తాను అమెరికాలో వున్నానని, అందుకే లేఖ విడుదల చేశారు. అందులో ఏపి మాజీ ముఖ్యమంత్రి తనను ఎలాంటి అవమానాలకు గురి చేయలే దని స్పష్టం చేశారు. ఒకసారి జగనే స్వయం గా తనను ఇంటికి ఆహ్వానించడంతో తాను, తన సతీమణితో కలిసి లంచ్కువెళ్లడం జరిగిందని చిరంజీవి చెప్పారు. ఆ సమ యంలో సినీ పరిశ్రమ సమస్యలపై ఒకసారి సమయం ఇస్తే మరోసారి వస్తామని చిరం జీవి చెప్పారు. దాంతో తప్పకుండా రండి. సమయం ఇస్తామని జగన్ చెప్పడం జరిగింది. కొంత కాలానికి ఓ ఐదుగురు సీనీ పెద్దలతో కలిస రావొచ్చని అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని సమాచారం చిరంజీవి చేరవేశారు. దాంతో ఐదుగురితో కాకుండా ఓ పది మంది వస్తామని చిరంజీవి చెప్పారు. కోవిడ్ కారణంగా ఐదుగురిని రమ్మని చెప్పడమే తప్ప మరో ఉద్దేశ్యం లేదని పేర్ని నాని చిరంజీవిని చెప్పి చూశారు. అయితే పది మందికి అవకాశమివ్వండని అడగడంతో సరే అన్నారు. పది మంది చిరంజీవి నేతృత్వంలో సినీ పెద్దలంతా జగన్‌ను కలిశారు. వచ్చారు. దీనిపై ఇప్పుడు అసెంబ్లీ లో రగడ జరగడం పట్ల చిరంజీవి వెంటనే స్పందించారు. జగన్ తప్పేమీ లేదని తేల్చారు. అయితే అసెంబ్లీలో బాలయ్య తన పేరు ఆ సమయంలో 9 నెంబర్‌గా రాయడం జరిగిం దని అందుకే తాను వెళ్లలేదన్న అర్ధమొచ్చేలా చెప్పారు. ప్రస్తుత సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌తో కూడా ఆ సమయంలో లిస్టు తయారు చేసింది ఎవరని కూడా ప్రశ్నించినట్లు బాలయ్య చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే బాలయ్య మానసిక పరిస్దితి ఇలా వుందంటూ పెద్దఎత్తున వైసిపి బ్యాచ్ ఆరోపణల పర్వానికి దిగింది. జగన్ హయాంలో మంత్రి పేర్ని నాని అయితే, ఇప్పటి మంత్రి కందుల దుర్గేష్‌ను అడిగానని చెప్పడంతో బాలయ్య ఏ పరిస్ధితుల్లో వున్నాడో అర్దం చేసుకోవచ్చంటూ రకరకాల ఆరోపణలు వైసిపి చేసింది. పైగా జగన్‌నుద్దేశించి అసెంబ్లీలో బాలయ్య మాట్లాడిన తీరుపై వైసిసి తీవ్ర అభ్యంతరం తెలిపింది. గతంలో వైఎస్ రాజశేఖరెడిడ్డి కనికరించకపోతే పరిస్దితి ఎలా వుండేదో ఒక్కసారి ఆలోచించుకోవాలని వైసిసి నాయకులు గుర్తు చేశారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పుల ఘటన తెరమీదకు తెచ్చారు. సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్, జ్యోతిష్యుడు సత్యనారాయణ మీద బాలయ్య కాల్పులు జరిపారు. ఆ సమయంలో ఓ సెక్యూరిటీ గార్డు కూడా మరణించినట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు నందమూరి కుటుంబంతా మూకుమ్మడిగా వెళ్లి, వైఎస్. రాజశేఖరెడ్డిని ప్రాధేయపడితే కనీసం జైలుకు వెళ్లకుండా బాలకృష్ణ బైటకువచ్చిన సంగతి గుర్తు చేశారు. బాలకృష్ణ ఆ కేసు నుంచి బైటకు వచ్చేందుకు అప్పటి వైద్యుడు కాకర్ల సుబ్బారావు జారీ చేసిన సర్టిపికెట్‌ను వైసిపి బైట పెట్టింది. ఎవరి మానసిక పరిస్దితి బాగాలేదని కేసు నుంచి తప్పించుకున్నారో చూడండి అంటూ వైసిసి నాయకులు చెబుతున్నారు. ఇదిలా వుంటే కూటమి మధ్య కుంపటి రగలకుండా వుండేం దుకు జనసేనకూడ వెంటనే స్పందించింది. చిరంజీవి మీడియాకు విడుదల చేసిన లేఖపై ఎవరూ స్పందించొద్దని పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఒక రకంగా జనసేన చిరంజీవికి మాపార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. చిరంజీవి జనసేన పార్టీకి ప్రచారం చేసింది లేదు. జనసేనకు చిరంజీవి అండగా వున్నది లేదనే అర్ధమె ుచ్చేలా జనసేన ప్రకటించింది. జనసేన నాయకులు ఎవరు స్పందించినా అది కూటమి కి నష్టం జరుగుందున్న అభిప్రాయాన్ని పార్టీ వ్యక్తం చేసింది. ఇక ఇది ఎంత దూరం పోతుందనేది ఇప్పటికిప్పుడు చెప్పేలా లేదు. బాలయ్య క్షమాపణ చెప్పాలని వైసిపి డిమాండ్ చేస్తోంది.జీవితం కాపాడిన రాజశేఖరరెడ్డిని జీవితాంతం బాలయ్య గుర్తుంచు కోవాలని హితవు పలుకుతున్నారు. అఖండ సినిమాకు సంబంధించి బాలయ్య నాలుగుసార్లు తనకే ఫోన్ చేసినట్లు మాజీ మంత్రి పేర్ని నాని ఒట్టేసి మరీ చెబుతున్నాడు. బాలయ్య మన వద్దకు రావడం ఎందుకు? టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించమని జగన్ ఆదేశిస్తే తానే అనుమతిచ్చినట్లు పేర్ని నాని అన్నాడు. ఇలా అటు సినిమా పరిశ్రమ, ఇటు రాజకీయ వేదికలన్నీ బాలయ్య వైపే వేళ్లు చూపిస్తున్నాయి.