`కాంగ్రెస్ లో అధికార యావ వున్నవాళ్ళే వుంటారు?
`సీఎం కావాలన్న కసితోనే పనిచేస్తారు?
`నాకేం తక్కువ అనే నాయకులే ఎక్కువగా వుంటారు?
`నచ్చని నాయకుడిని దించేసే దాకా రాజకీయం చేస్తూనేవుంటారు?
`ఇందిరా గాంధీ నే బహిస్కరించిన నేతలున్నారు?
`దేశమంతా కాంగ్రెస్ లో ఇలాంటి నాయకులే కనిపిస్తారు!
`ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ లో కనిపించే రాజకీయాలు అన్ని ఇలాగే వుంటాయి!
`1971 లో అత్యధిక మెజారిటీ తో కాంగ్రెస్ ను అధికారం లోకి తెచ్చిన పీవీ. నర్సింహారావు ను 13 నెలలు కూడా సీఎం గా ఉండనివ్వలేదు?
`జై ఆంధ్ర ఉద్యమం తెచ్చి కుర్చీ నుంచి దించేశారు?
`1989లో కాంగ్రెస్ ను అధికారంలో కి తెచ్చిన చెన్నారెడ్డిని హైదరాబాద్ లో అల్లర్ల పేరుతో దించేశారు?
`1992లో ఇంజనీరింగ్ కాలేజీలలో సీట్లు అమ్ముకున్నట్లు ఆరోపణలు తెచ్చి నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి ని దించేశారు?
`కాంగ్రెస్ అధికారంలో ఉంటే ప్రతిపక్షం అవసరం లేదు?
`ప్రతిపక్షానికి పెద్ద పని ఉండదు!
`ఇప్పుడు కూడా అంతే.. ఎప్పుడైనా అంతే?
`ఇంకా కాంగ్రెస్ రాజకీయాలు ఒంట బట్టని సీఎం. రేవంత్ రెడ్డి.
`కాంగ్రెస్ లో అతి పెత్తనం కుదరదు.. అతి మేతకతనం పనికిరాదు?
`ఎంత సేపు బీఆరఎస్ వల్ల నష్టమని సీఎం రేవంత్ అనుకుంటున్నారు?
`అసలైన ఇబ్బంది కాంగ్రెస్ నుంచే అని ఇప్పటికి తెలుసుకోలేక పోతున్నారు?
`కాంగ్రెస్ లో ఉంటూ టీడీపీ ని పదే పదే సీఎం. రేవంత్ గుర్తు చేసుకుంటున్నారు.
`కరడు గట్టిన కాంగ్రెస్ నేతలకు ఆ మాటలు గిట్టవని తెలుసుకోలేక పోతున్నారు?
`పైకి సంతోషంగా ఉన్నా, లోలోన కాంగ్రెస్ నాయకులు రగిలిపోతున్నారు?
`గతంలో నాయకులు సీఎంల మీద కుట్రలు చేసేవారు?
`ఇప్పుడు సీఎం తమ మీద అపవాదులు సృష్టిస్తున్నారని అనుకుంటున్నారు?
`పదేళ్లు నేనే సీఎం అని అనుకున్నప్పుడు పదవి గురించి మాత్రమే ఆలోచించాలి?
`నాయకుల తలలో నాలుకలా సీఎం వుండాలి?
`తాజా పరిస్థితులలో అన్ని వేళ్ళు సీఎం వైపే చూపిస్తున్నాయి?
`వన్ షాట్ టు బొర్డ్స్ అనుకున్నట్లున్నారు?
`ఎక్కడో మిస్ ఫైర్ అయ్యింది…గురి తప్పి ఎదురు తిరిగేలా వుంది?
`తిన్నారు.. తిన్నారు.. అంటేనే కేసీఆర్ ను పక్కన పెట్టారు?
`ఎన్ని పథకాలు అమలు చేసినా బీఆరఎస్ అవినీతి చేసిందంటే జనం నమ్మి ఓడించారు?
`ఇప్పుడు కాంగ్రెస్ లోనే ఒకరిమీద, మరొకరు బురద చల్లుకుంటున్నారు?
హైదరాబాద్,నేటిధాత్రి: అధికారంలోకి రావడానికి కొట్లాడతారు! అదికారంలోకి వచ్చిన తర్వాత కొట్లాడుకుంటారు!! ఇది అనాదిగా కాంగ్రెస్ పార్టీ గురించి ఎప్ప్పుడూ చెప్ప్పుకునే మాట. ప్రతిపక్షంలో వున్నప్ప్పుడు నాయకులంతా కలిసి వుంటారు. అదికారంలోకి రాగానే నాయకులుంతా ఆగం చేసుకుంటారు. ఒకరికొకరు పుల్లలు పెట్టుకుంటారు. ఒకరిపై ఒకరు పిర్యాదులు చేసుకుంటారు. ఒకరి కాళ్లు, ఒకరు పట్టుకొని లాగేసుకుంటారు. ఇది ఆ పార్టీ ఆనాటి నుంచి వున్న ఆనవాయితీయే అంటారు. 2004 వరకు ఈ పరిస్ధితి వుండేది. 2004 తర్వాత ఆ పరిస్దితిని వైఎస్ కొంత వరకు మార్చాడు. కాని మళ్లీ ఇప్ప్పుడు మొదలైంది. కాకపోతే అప్ప్పుడు నాయకులు, సిఎంలను బెదిరించేవారు. ఇప్ప్పుడు సిఎం. నాయకులను బెదిరిస్తున్నాడు? కట్టడి చేస్తున్నాడు? అనే మాటలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ గందరగోళాలు ఎదురౌతున్నాయని తెలుస్తోంది. ప్రజా సేవ గాలికి వదిలేసి, పదే పదే రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు. అందుకు సిఎం. రేవంత్ నుంచి మొదలు, నాయకులంతా అదే చేస్తున్నారు. నిత్యం కేసిఆర్ స్మరణ తప్ప మరేం చేసినట్లు కనిపించడం లేదు. అవినీతి లేదంటూనే ఎప్ప్పుడూ ఏదో ఒకటి తెరమీదకు తెచ్చుకుంటున్నారు. ఈ రెండేళ్ల కాలంలో ఏం చేశారంటే ప్రతిపక్ష బిఆరఎస్ మీద కేసులు వేస్తున్నాం…అవినీతి పరులుగా గత పాలకులను చిత్రీకరిస్తున్నామని చెప్ప్పుకుంటున్నారు. లోలోన పార్టీలో జరిగే కుట్రలను మాత్రం పెంచిపోషించుకుంటున్నారు. పదేళ్ల తర్వాత పార్టీని అదికారంలోకి తీసుకొచ్చిన ఘనత దక్కించుకున్న సిఎం. రేవంత్ రెడ్డి ఇటీవల విమర్శల పాలౌతున్నారు. తనకు తానుగా చేసుకుంటున్నారా? లేక నాయకులనుంచి ఎదుర్కొంటున్నారా? అన్నది తేలాల్సి వుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వార్త తెలంగాణ రాజకీయాýను ఒక్క కుదుపు కుదిపేసింది. కాంగ్రెస్ అధికారంలో వుంటే ప్రతిపక్షానికి పని వుండదన్న మాటను మరోసారి రుజువు చేస్తున్నారు. ప్రతిపక్షానికి అవకాశమివ్వకుండా తమకు తమే గోతులు తవ్వుకుంటున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి సిఎం. అవుతారని జనం అనుకున్నారు. కాని ఎన్నికల తర్వాత నేనే సిఎం. అని అనుకున్న వారు కూడా చాలా మంది వున్నారు. తెలంగాణ రాకముందు కూడా ఇదే వుండేది. తెలంగాణ వస్తే తానే సిఎం. అని అప్ప్పుడే అరడజను మంది నాయకులు చెప్ప్పుకునేవారు. కాని వారి ఆశలు అప్ప్పుడు నెరవేరలేదు. ఇప్ప్పుడైనా నెరవేరుతాయా? అనుకుంటే రేవంత్ రూపంలో వారికి సిఎం. అయ్యే అవకాశం దక్కలేదు. అయినా నాయకులు సర్ధుకుపోతున్నారు. పాలనలో భాగస్వాములౌతున్నారు. తమ పనులు తాము చేసుకుంటూ పోతున్నారు. అయితే ఇటీవల వరుస సంఘటలన్నీ ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా సిఎం. రేవంత్ వైపే అందరి వేళ్లు చూపిస్తున్నాయి. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీకి అసలే మంచిదికాదు. అందుకు కారణం కూడా సిఎం. రేవంత్ అనే మాటలు బలంగా కాంగ్రెస్‌లోనే వినిపిస్తున్నాయి. తాజా సంఘటనకు ముందు ఓ రెండు నెలల క్రితం సిఎం. రేవంత్ రెడ్డి క్యాబినేట్లో మంత్రులకు క్లాస్ తీసుకున్నాడు?అనే వార్త ఓ దినపత్రికలో ప్రదానంగా వచ్చింది. అప్ప్పుడే విబేదాలకు ఆజ్యం పడింది. అలా వార్త వచ్చినప్ప్పుడే మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డ స్పందించారు. సిఎం. రేవంత్ క్లాస్ తీసుకోవడమేమిటి? అనే మాటలు సన్నిహితుల వద్ద అన్నారు. ఆనాడే సిఎం. రేవంత్ రెడ్డి ఆ పత్రిక వ్యాసం మీద స్పందిస్తే ఆ సమస్య అక్కడితో ఆగిపోయేది. కాని ఆ సమయంలో సిఎం. మౌనం వహించారు. ఇప్ప్పుడు మా మంత్రుల మీద వార్తలు వస్తే సహించేది లేదంటున్నారు. ఆదిలోనే సిఎం. స్పందించి వుంటే, మంత్రుల మధ్య, సిఎం. రేవంత్ మధ్య దూరానికి అవకాశమే వుండేది కాదు. పైగా ఈ మధ్య ఓ చానల్లో వచ్చిన కథనంపై వెంటనే సిఎం. స్పందిస్తే పరిస్దితి మరోలా వుండేది. కాని ఆయన చిలికిచిలికి గాలి వానగా మారే దాకా స్పందించలేదు. పైగా ఇదే విషయంపై ఓ దినపత్రికలో, టివి. చానల్లో వచ్చిన తెలిసీ తెలియని పలుకులు వినిపించాయి. ఆ కధనంలో దీనంతటి వెనుక వున్న మతలబులో సిఎం. రేవంత్ స్పష్టంగా కనిపిస్తున్నట్లు తేలిపోయింది. ఎందుకంటే ప్రభుత్వానికి తెలియకుండానే పోలీసు అదికారులు సిట్ వేశారని పత్రిక చెప్పడం వల్ల రేవంత్ ఇమేజ్ డ్యామేజే అవుతుంది తప్ప, పెరగదు. ఆ మాత్రం సోయి లేకుండా ఓ పత్రికాదిపతి తన చెప్పేశారు. అంటే సిఎం. రేవంత్‌ను సేఫ్ జోన్లో వుంచాలనుకునే ఉద్ధేశ్యమే అయినా, సిఎం చేతిలో కంట్రోల్ లేదని తేల్చినట్లైంది. పైగా జరిగిన దానిలో అంతర్యాన్ని ఆయన బహిర్గం చేశారు. మంత్రుల పేర్లు చెప్పేశారు. బొగ్గు గని లీజు సంగతి అని తేల్చేశారు. ఇద్దరు మంత్రుల మధ్య జరుగుతున్న పోరుగా చిత్రీకరించారు. ఇద్దరు ఒక రకంగా సిఎం. రేవంత్‌కు ఎదరులేకుండా చేయాలని ఆ పత్రిక అనుకొని కథనం వండి వార్చింది. కాని మిస్ పైర్ అయ్యింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలుగా రాజకీయం మారుతుందనుకున్నారు. కుదరలేదు. ఇప్ప్పుడు ఎవరు యూటర్న్ తీసుకునే పరిస్తితి లేకుండా చేసుకున్నారు. ప్రజల దష్టిలో అవినీతి ఏ మేరకు జరుగుతుందో తమకు తామే చెప్ప్పుకున్నట్లు చేశారు. ఇదిలా వుంటే సిఎం. రేవంత్‌రెడ్డి చేసిన కొన్ని కీలకమైన వ్యాఖ్యల వల్ల అటు కాంగ్రెస్ నాయాకులు, ఇటు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్తితి తెచ్చారు. తెలంగాణలో బిఆరఎస్ దిమ్మెలు కూల్చితే, ఏర్పాటు చేయాల్సినవి కాంగ్రెస్ గద్దెలా? టిడిపి గద్దెలా? అనేది ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాలి. పనిగట్టుకొని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం ఎదగాలనుకోవడంలో ఆంతర్యం కూడా కాంగ్రెస్ నాయకులకు అర్ధం కావాలి? కాంగ్రెస్‌ను లేకుండా తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో వచ్చిందే తెలుగుదేశం పార్టీ. కాంగ్రెస్‌ను వెయ్యి మీటర్ల లోతులో పూడ్చిపెట్టాలని చెప్పింది చంద్రబాబు నాయకుడు. కాంగ్రెస్ నాయకులను కుక్క మూతి పిందెలు అని ఎద్దేవా చేసింది ఎన్టీఆర్. అలాంటి తెలుగుదేశం పార్టీకి మళ్లీ పునాది వేయాలని కాంగ్రెస్ పార్టీ సిఎం. రేవంత్ రెడ్డి చెప్పడం అనేది కాంగ్రెస్‌కు తీరని నష్టాన్ని మిగిల్చుతుంది. పైగా సిఎం. పదవిలో వున్న రేవంత్‌రెడ్డి గద్దెలు కూల్చమని చెప్పడమే రాజ్యాంగరిత్యా ఎంత వరకు సమంజసమో? ఆయనే చెప్పాలి. శాంతిభద్రతలను కాపాడాల్సిన సిఎం. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వల్ల బిఆరఎస్ గద్దెలు కూల్చితే పోలీసులు కేసులు ఎదుర్కొని,జైలుపాలయ్యే వారి జీవితాలను ఎవరు భరోసా ఇస్తారు? నిజానికి కాంగ్రెస్ పార్టీలో వుంటూ ఇన్ని రకాల వ్యాఖ్యలు చేస్తున్నా నాయకులు ఎంత సంయమనంతో వుంటున్నారు అంటే రేవంత్ రెడ్ది ఎంతో అదష్టవంతుడు. ఆ అదష్టాన్ని ఆయన చేజేతులా చెడగొట్టుకుంటున్నారని మాత్రం అర్దమౌతోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన పివి. నర్సింహారావును కనీసం 13 నెలలు కూడా సిఎం. సీట్లో కూర్చొనివ్వలేదు. ఆయనను పదవిలో నుంచి దించేయడానికి ఏకంగా జై ఆంద్రాఉద్యమాన్ని తెచ్చి పివిని దించేశారు. దేశాన్ని ఎదురులేకుండా ఐదేళ్లపాటు పాలించి పివి. ఆంధ్రప్రదేశ్‌ను పట్టుమని పదిహేను నెలలు పాలించలేకపోయారు. తర్వాత 1989లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన చెన్నారెడ్డిని ఏడాది తిరగకుండానే పాతబస్తీలో అర్లర్ల పేరుతో పదవి నుంచి దింపేశారు. కాంగ్రెస్ నాయకులు అంత స్ట్రాంగ్‌గా వుండేవారు. తర్వాత కాలంలో ఏపికి ఐటిని, ప్రైవేటు ఇంజనీరిగ్ విద్యను పరిచయం చేసి, టెక్నాలజీ రంగంలో ఏపి దూసుకపోయేలా చేసిన నేదురుమల్లి జనార్ధన్ రెడ్డిని ఇంజనీరింగ్ సీట్ల విషయంలో లేని పోని వివాదాలు సష్టించి దించేశారు. రెండేళ్లు గడుస్తున్నా రేవంత్‌రెడ్డిపై ఎవరూ తిరుగుబాటు చేయడం లేదు. అందుకు సంతోషించాల్సిన సిఎం. రేవంత్‌రెడ్డి తనకు తానుగానే కొన్ని ఇబ్బందికరమైన పరిస్ధితులను కొని తెచ్చుకుంటున్నారని చెప్పక తప్పదు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను అమలు చేయలేకపోయినా, చేస్తున్నామని చెబుతున్నా జనం కాలం గడవనీ అనుకుంటున్నారు తప్ప, ఎక్కడాఉద్యమాలు చేయడం లేదు. కాని రేవంత్ ఓ వైపు టిడిపిని పెంచాలని చూస్తే మాత్రం కాంగ్రెస్ నుంచి తొలి తిరుగుబాటు తెచ్చుకుంటారని చెప్పడంలో సందేహం లేదు.
