Raghunath Reddy Alleges Police ObstructioRaghunath Reddy Alleges Police Obstructionn
విప్ జారీకి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు…
మంచిర్యాల డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు విప్ జారీ చేసేందుకు మున్సిపాలిటీ కార్యాలయం లోకి వెళుతుండగా అకారణంగా పోలీసులు అడ్డుకున్నారని మంచిర్యాల డిసిసి అధ్యక్షులు పి రఘునాథరెడ్డి ఆరోపించారు. పోలీసుల సూచనల మేరకు మున్సిపాలిటీ కార్యాలయం నుండి బయటకు వచ్చి టెంట్ వద్ద కూర్చున్నానని ఆయన వివరించారు. గొడవలకు ఆస్కారం లేకుండా పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారాలు జరిగేలా కృషి చేస్తామని తెలిపారు.
