
Police Permission Must for Ganesh Mandapams: SI Kranthi Kumar
వినాయక మండపాలకు పోలీసు అనుమతి తీసుకోవాలని ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ పటేల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
గణేష్ మండపం ఏర్పాటుకు పోలీసు వారికి ముందస్తు సమాచారం మరియు కింద తెలిపిన లింక్ యందు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం పరిధిలో వివిధ గ్రామాలకు చెందిన గణేష్ విగ్రహాలు పెట్టె ప్రతి ఒక నిర్వాహకులకు , ప్రతి ఒక గణేష్ మండప నిర్వాహకులకు policeportal.tspolice.gov.in లింక్ పై మీ యొక్క గణేష్ & మండపం వివరాలు అన్ని నమోదు చేసుకొని ఒక సెట్ జిరాక్స్ పోలీస్ స్టేషన్ లో ఇవ్వగలరు మీరు సరైన సమాచారం ఇచ్చినచో మండపలకు పోలీస్ వారు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సారైనా భద్రత ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సకాలంలో పూర్తి సమాచారం ఇచ్చి సహకరించగలరు అని ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ పేర్కొన్నారు.