Coimbatore Gang Rape Accused Shot and Arrested
గ్యాంగ్ రేప్ నిందితులపై పోలీస్ కాల్పులు.. ముగ్గురు అరెస్ట్
గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు అరెస్ట్ అయ్యారు. ఈ తెల్లవారుజామున పారిపోతున్న వాళ్లపై పోలీసులు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులోని కోయంబత్తూరు గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు అరెస్ట్ అయ్యారు. విమానాశ్రయం సమీపంలో ఆదివారం మహిళా కళాశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించినందుకు ఈ ముగ్గురు వ్యక్తులను ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఉదయం(మంగళవారం) తెల్లవారుజామున పోలీసులు.. నిందితుల జాడ తెల్సుకొని వారిని పట్టుకునేందుకు వారు ఉన్న ప్రాంతానికి వెళ్లారు. పోలీసుల జాడ కనిపెట్టిన నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు.. పారిపోతున్న నిందితుల కాళ్ల మీద కాల్పులు జరపాల్సి వచ్చింది. అనంతరం తవాసి, కార్తీక్, కాళీశ్వరన్ లను అదుపులోకి తీసుకుని, అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
