హద్దులు దాటిన పోలీస్ మాఫియా..!

# పోస్టింగులు.. డబ్బుల మూటలు..
రాష్ట్రవ్యాప్తంగా తీరు.. ఇక్కడ అదే తీరు.

# నర్సంపేటలో జరిగే ప్రతీ దందాలో పోలీస్ వ్యవస్థ అండా..?

# నర్సంపేటలో అక్రమ అరెస్టులపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి..

#కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలలో నర్సంపేటకు అరెస్టుల గిఫ్టులు..

#న్యాయవాదులు నవ్వుతున్నారు.. పోలీస్ ల తీరును చూసి..!

#రాష్ట్ర మాజీ సివిల్ సప్లై చైర్మన్, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి..

నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేటలో రోజురోజుకు పోలీస్ మాఫియా హద్దులు దాటి దిగజారుడుకు పాల్పడుతున్నది. కాంగ్రెస్ పార్టీ నాయకుల చెప్పులు మోస్తూ వారు చేసే దందాలలో పోలీస్ వ్యవస్థ సహకరిస్తూ వారికి అండగా ఉంటున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులకు పోస్టింగ్ కావాలంటే డబ్బుల మూటలు ముట్టాల్సిందే ఇది రాష్ట్రవ్యాప్తంగా తీరు.. ప్రస్తుత నర్సంపేటలో అదే తీరు.
జరుగుతున్నది. అధికార పార్టీ నాయకుల చెప్పులు మోసే వ్యవస్థకు పోలీస్ వ్యవస్థ దిగజారింది అని రాష్ట్ర మాజీ సివిల్ సప్లై చైర్మన్,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట పోలీస్ వ్యవస్థపై మండిపడ్డారు. మాజీ మంత్రి హరీష్ రావు ,ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిల అక్రమ అరెస్టులకు నిరసనగా నర్సంపేట పట్టణంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం నేపథ్య అనంతరం టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు
ఆర్టీసీ బస్సును రాయితో కొట్టడం పట్ల అద్దం ధ్వంసం అయింది. కాగా బస్సు పై దాడి చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు రవి అనే వ్యక్తిపై కేసు పెట్టకుండా మరికొందరు నాయకులను రాత్రికి రాత్రే 14 రోజుల రిమాండ్ కు పంపడం పట్ల మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నర్సంపేట పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని డిపార్ట్మెంట్ పనిశక్తి తగ్గిపోయి నిద్ర వస్తలో ఉన్నాయి. కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ పని మాత్రం పెరిగింది అది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పులు మోసే వారు,పోస్టింగులలో డబ్బులు ముట్టజెప్పున వారు,గతంలో పోస్టింగులల్లో డిఫాల్ట్ అయ్యి జాయినింగ్ అయినవారు మాత్రమే అని ఆరోపించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నదని దీంతో బిఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేస్తూ కాలయాపన చేస్తున్నారని పెద్ది ఆగ్రహం వ్యక్తం చేశారు.దేశంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం పెట్టింది ఒక్క కేసీఆర్ ప్రభుత్వం హయంలోనే అని కనీసం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ నివాళులు అర్పించే పరిస్థితి లేదని కనీసం ప్రతిపక్షాలకు కూడా నివాళులు అర్పించే స్వేచ్ఛ హైదరాబాదులో లేదు అలాగే నర్సంపేటలో కూడా లేని పరిస్థితి ఎదురైతున్నదని ఇందుకు ఉదాహరణ నర్సంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తుంటే పోలీసులు ఫోటోస్ తీస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికే గ్రామీణ స్థాయిలో అరాచకాలు మొదలయ్యాయి ఇక నుండి తప్పుడు కేసులు పెడితే ఊరుకునేది లేదని పోలీసులను హెచ్చరించారు. నర్సంపేట లో పోలీస్ అరాచకాల పట్ల వరంగల్ పోలీస్ కమిషనర్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాను. విచారణ చేపిస్తా అన్నారు కానీ అరచకాలు పెరిగినాయి అని పేర్కొన్నారు.గురువారం నిరసనలో జరిగిన సంఘటన పట్ల రాస్తారోకో చేసిన అందరి మీద కేసు పెట్టి అర్ధరాత్రి జైలుకు పంపించారు.చట్టాన్ని వ్యతిరేకిస్తే కేసులు పెట్టొచ్చు కానీ అందరిపై కేసు పెట్టడం అన్యాయం అని పెద్ది అన్నారు. 41 సి ఆర్ పి సి కింద నోటీస్ ఇచ్చి విడుదల చేయాల్సి ఉంది కానీ పోలీసుల కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టారు.80 ఏళ్ల వ్యక్తి నామాల సత్యనారాయణపై ఏ1నిందితునిగా కేసు నమోదు చేశారు. పోలీసులకు చట్టాల పైనా అవగాహన లేదా వ్యవస్థను ఏం చేద్దామని అనుకుంటున్నారు అని నర్సంపేట పోలీసులను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు.ఒక న్యాయవాదిపై కేసు నమోదు చేశారు.మీరు నమోదు చేసిన న్యాయవాది కేసుపై న్యాయవాదులు నవ్వుతున్నారు పోలీస్ ల తీరును చూసి అని ఎద్దేవా చేశారు.7 ఎండ్ల శిక్షకు లోబడి ఉంటే స్టేషన్ బెయిల్ ఇవ్వాలి కానీ రిమాండ్ కి ఎలా పంపారు.నర్సంపేట బార్ అసోసియేషన్ కూడా ఈ సంఘటన ఖండించారు.న్యాయవాదులు కూడా విధుల బహిష్కరణ చేశారు అదేనా ఒక్క సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం నర్సంపేటకు ఇచ్చిన గిఫ్ట్…? ఏం వచ్చిందొ త్వరలో సమావేశం పెట్టి ప్రజలకు తెలియజేస్తాం అని పెద్ది హెచ్చరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాల సందర్భంగా ఏడాదిగా ఇదే పాలనా..కాంగ్రెస్ సంబరాలు .. బి ఆర్ ఎస్ పార్టీ నాయకులపై కేసులు పెట్టడం
అని కాంగ్రెస్ ప్రభుత్వంపై స్థానిక కాంగ్రెస్ నాయకత్వంపై ధ్వజమెత్తారు.
మెడికల్ కాలేజ్ ప్రారంభం సందర్భంగా నన్ను అరెస్టు చేశారు.కలశాల కట్టించింది నేనే సంబరాలు మేము చేద్దామనుకున్నాం అయిన ఎందుకు అరెస్టు చేస్తున్నారు అంటే పోలీసుల వద్ద సమాధానం లేదు అని అసహనం వ్యక్తం చేశారు.నర్సంపేటలో జరిగే ప్రతీ దందాలో పోలీసులు చైన్ సిస్టం అమలు చేస్తున్నారు.అందరి బాగోతాలు,ఫోన్ పే లు,గూగుల్ పే లు,బ్యాంకింగ్ దందాలు,బ్లాక్ మనీ పట్ల మా లీగల్ అద్వైజర్ వద్ద సేకరణ చేసి సిద్ధంగా ఉంచినం. లీగల్ గా పోరాడుతాం బాధ్యులపై అధికారులపై కేసులు పెడతాం,పరిధిలు.దాటారు ప్రతీకారం ఉంటుంది అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పోలీసులను హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు నాగేళ్లి వెంకటనారాయణ గౌడ్, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి,డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి,గోనె యువరాజు, కౌన్సిలర్లు నాగిషెట్టి పద్మ ప్రసాద్,క్లస్టర్ బాధ్యులు,మాజీ ఎంపీపీలు వేములపెల్లి ప్రకాశ్ రావు,మోతే పద్మనాభరెడ్డి, జడ్పిటిసిలు జయ గోపాల్ రెడ్డి ,సర్పంచులు,ఎంపీటీసీలు, పట్టణ,మండల పార్టీ ముఖ్య నాయకులు నరసింహరాములు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!