జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా ఎన్నికల షెడ్యూలు విడుదల అవడంతో పోలీసులు వాహన తనిఖీలు ప్రారంభించారు. జైపూర్ మండలంలోని ఇందారం బ్రిడ్జి కుందారం సుందిళ్ల బ్యారేజ్ బ్రిడ్జి సమీపాలల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. సోమవారం రోజున మండల సరిహద్దుల్లో స్థానిక ఏసిపి వెంకటేశ్వర్లు సిఐ డి. మోహన్ ఎస్సై జి. శ్రీధర్ లు కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీపి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో ప్రతిఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని,అన్నారు. వాహనాల్లో అక్రమంగా మద్యం రవాణా చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని 50 వేలకు మించి నగదును తీసుకెళ్తే సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు. వాటికి సంబంధించిన పత్రాలు వారి దగ్గర ఉంచుకోవాలని ఎలాంటి పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు.ఎన్నికలు ప్రక్రియ పూర్తయ్యేవరకు నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎసిపి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏసిపి వెంకటేశ్వర్లు, సీఐ డి. మోహన్,ఎస్సై శ్రీధర్ కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.